తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను వరాల దేవుడిగా అభివర్ణిస్తారు. పెండింగ్ లో ఉన్న అంశాల్ని పట్టించుకోనట్లుగా ఉండే ఆయన.. హటాత్తుగా మెలుకువ వచ్చినట్లుగా లేచి.. వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ.. అదంతా సారుగారి రాజకీయ వ్యూహంలో భాగమనే చెప్పాలి.
కేసీఆర్ మనసు దోచుకునేలా సమస్యల్ని తీర్చమని వేడుకునే వారి మనసు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేయటంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల్ని పురస్కరించుకొని ఎన్నికల మేనిఫేస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని సినీ పరిశ్రమకు వరాలు ప్రకటించారు.
వాటన్నింటిలోనూ.. మిగిలిన నగరాల్లో మాదిరి సినిమా టికెట్ ధర పెంపు అన్నది సినిమావారికే అవకాశం ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. ఆ వెంటనే.. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు విపరీతమైన సంతోషానికి గురై.. తమ హర్షాన్నివ్యక్తం చేస్తూ పోటీపడి ప్రకటనల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ప్రేక్షక దేవుళ్లు అంటూ చెప్పే వాడి ఈతిబాధల గురించి అటు ప్రభుత్వం కానీ ఇటు సినిమా వాళ్లు కానీ పట్టించుకున్నది లేదు.
సినిమా టికెట్ల పెంపు విషయానికి వస్తే.. ఇప్పటివరకు మల్టీఫ్లెక్సుల్లో రూ.200 ఉంది. కరోనా కారణంగా దాదాపు ఎనిమిది నెలల నుంచి సినిమా ధియేటర్లు మూసి ఉంచారు. ఇప్పుడు తెరిచినా.. భయంతో వెళతారా? లేదా? అన్నది సందేహమే. ఇలాంటివేళలో.. టికెట్ల ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇస్తే.. ప్రేక్షకుడి మాటేమిటి? పెద్ద సినిమాలు.. స్టార్ హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ తో టికెట్ ధరలు పెంచినా థియేటర్ కు వెళతారు. అక్కడివరకు ఓకే. కానీ.. పెరిగిన ఖర్చులో భాగంగా బడ్జెట్ కోత విధించుకుంటే.. మిగిలిన సినిమాలకుప్రేక్షకులు వెళ్లే పరిస్థితి ఉండదు.
అదే జరిగితే.. ఒక మోస్తరు.. చిన్నసినిమాలు బతికి బట్టకట్టలేని పరిస్థితి ఉంటుంది. స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేసి.. పది నుంచి పదిహేను కోట్లు రెమ్యునరేషన్ వసూలు చేసే బదులు.. వారిని అభిమానించి.. ఆదరించి.. పెద్దోళ్లను చేసిన ప్రేక్షక దేవుళ్ల కోసం కాస్తంత రెమ్యునరేషన్ తగ్గించుకుంటే..టికెట్ల ధరలు పెంచాల్సిన అవసరం ఉండదు కదా? అయినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో టికెట్ ధరలు పెంచేస్తే.. థియేటర్ కు వెళ్లాలా? వద్దా? అన్న సందేహంలో ఉన్న ప్రేక్షకుడికి.. ఇంట్లోనే ఓటీటీలో చూస్తే పోలా? అన్న భావన కలగనీయటం ఎంతవరకు సమంజసం?
సినిమా అన్నది అగ్రహీరోలకు మాత్రమే కాదు కదా? ఎంతో మంది ఉంటారు? వారందరి పొట్ట కొట్టేలాంటి చర్యలకు సినీ పెద్దలు కొందరు హర్షాతిరేకాలు వ్యక్తం చేయటం ఏమిటి? ఇప్పడున్న రూ.200 ఉన్న టికెట్ ధరను రూ.400 చేస్తే.. ఒక కుటుంబం సినిమాకు వెళితే.. ఖర్చు తడిచి మోపెడు అవుతుంది. ఆ ప్రభావం సదరు కుటుంబం మీద ఉండటమే కాదు.. ఆ నెలలో చూడాల్సిన మిగిలిన సినిమాల మీద పడుతుందన్నది మర్చిపోకూడదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ భాషలోనే చెప్పాలంటే.. గుప్పెడు మంది సినిమా వాళ్ల కోసం కోట్ల మంది ప్రేక్షకుల మీద పడే భారం మాటేమిటి? వరాల దేవుడికి సినిమా వాళ్ల ముందు.. ప్రేక్షక దేవుళ్ల ఎందుకు కనిపించలేదంటారు?
This post was last modified on November 24, 2020 5:42 pm
ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…