వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని తన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎప్పటిలాగే దాదాపుగా రెండు గంటలకు పైగా మీడియా ప్రతినిధులను కూర్చోబెట్టి తన గోడు వెళ్లబోసుకున్న జగన్.. కావాలని చెప్పారో, లేదంటే నోరు జారి మరీ చెప్పారో తెలియదు గానీ… తన పార్టీ కీలక నేతలు, యాక్టివ్ కేడర్ గురించి ఆయన ఓ పచ్చి నిజాన్ని చెప్పేశారు. అదేంటంటే… తన పార్టీ కార్యకర్తలు ఇప్పుడు అంతగా యాక్టివ్ గా లేరని, నేతలు కూడా అలాగే ఉన్నారని, సరైన సమయంలో రంగంలోకి దూకుతారంటూ చివరగా ఓ మాట అనేశారు.
జగన్ చెప్పింది నిజమే. పార్టీ అధిష్ఠానం ఎన్ని నిరసనలు, ధర్నాలకు పిలుపునిచ్చినా ఎక్కడ కూడా పెద్దగా స్పందన లేదు. కీలక నేతలు అలా బయటకు వచ్చి ఇలా ఫొటోలకు ఫోజులిచ్చి తుర్రుమంటున్నారు. వారి బాటలోనే యాక్టివ్ కేడర్, ద్వితీయ శ్రేణి కార్యకర్తలు కూడా ఏదో ముక్తసరిగా ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారు. అసలు వైసీపీ ఇప్పటిదాకా చేపట్టిన నిరసనల్లో రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాంతంలో కూడా భారీ ప్రదర్శనలు కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. సాక్షాత్తు జగన్ సొంత జిల్లా కడపలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే పార్టీ పత్రిక సాక్షి మాత్రం నిరసనలు హోరెత్తాయి అంటూ బాకాలు ఊదుతోంది. ఈ బాకాలను చూసి ఆ పార్టీ కేడరే నవ్వుకుంటున్నారు.
సరే… మీడియా సమావేశంలో జగన్ ఏమన్నారంటే… తాను కేంద్రంతో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే… కూటమి సర్కారు వాటిలో 10 కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తోందని, దీనిని అడ్డుకుంటామని ఆయన చెప్పారు. ఈ విషయంలో తగ్గేదే లేదన్న జగన్… ప్రస్తుతం మా పార్టీ నేతలు యాక్టివ్ గా లేరు. సరైన సమయం చూసుకుని వారు రంగంలోకి దిగుతారు. అప్పుడు కూటమి సర్కారుకు చుక్కలు కనిపించడం ఖాయమని జగన్ చెప్పారు. ఏది ఏమైనా తన పార్టీ ఇప్పుడు యాక్టివ్ గా లేదని ఓ పార్టీ అదినేత హోదాలో జగన్ చెప్పడం చూస్తుంటే.. ఈ తరహా రాజకీయ నేతను ఇంకెక్కడ చూసి ఉండమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రాజకీయ నేతలంటేనే తిమ్మిని బమ్మిని చేసి కాలం గడిపే వారు. కొందరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పినా… పార్టీ గురించి, పార్టీ నేతల గురించి జగన్ మాదిరిగా మాట్లాడే నేతలు చరిత్రలో లేరు. తన పార్టీ పరిస్థితి బాగా లేకున్నా… దానిని కప్పిపుచ్చి ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ నేతలు సాగుతూ ఉంటారు. ఆ విమర్శల జడిలో తన పార్టీ గురించి ప్రత్యర్థులు అంతగా ఆలోచించలేరులే అన్నది ఆయా పార్టీల అభిప్రాయం. అయితే జగన్ ఓ వైపు తన ప్రత్యర్ది పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే… తన పార్టీలోనే బలహీనతలను ఇలా బయటపెట్టేసుకుని అభాసుపాలయ్యారు.
This post was last modified on September 10, 2025 5:49 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…