Political News

మీరు ముగ్గురూ చ‌రిత్ర హీనులు: ష‌ర్మిల ఫైర్‌

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి అభ్య‌ర్థి జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్ రెడ్డి 300 ఓట్ల వ‌ద్దే ఆగిపోయారు. ఈ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. ఏపీలోని మూడు పార్టీల‌ను ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. “మీరు ముగ్గురూ చ‌రిత్ర హీనులు” అంటూ.. టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీ అధినేత‌ల‌పై ఆమె విరుచుకుప‌డ్డారు. ముగ్గురూ క‌లిసి ఉమ్మ‌డిగా ఎన్డీయే అభ్య‌ర్థిని గెలిపించార‌ని ఎద్దేవా చేశారు. తెలుగు జాతి పౌరుషం అంటూ పార్టీ పెట్టిన టీడీపీ.. ప్ర‌శ్నిస్తాన‌ని వ‌చ్చిన జ‌న‌సేన‌, తెలుగు వారికోస‌మే క‌ట్టుబ‌డి ప‌నిచేస్తామ‌న్న వైసీపీ ఇప్పుడు మొహాలు ఎక్క‌డ పెట్టుకుంటార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

అంతేకాదు.. ఆర్ఎస్ఎస్ కు చెందిన అభ్య‌ర్థికి ఓటు వేయించి.. ఈ మూడు పార్టీలు తెలుగు జాతికి ద్రోహం చేశాయ‌ని ష‌ర్మిల విమ‌ర్శించారు. “ఈ రోజు తెలుగు జాతికి చీకటి రోజు” అని పేర్కొన్నారు. “తెలుగు జాతికి నేడు చీకటి రోజు. ఆత్మగౌరవమే అజెండా అని టీడీపీ, పదవుల కన్నా జాతి ప్రయోజనం ముఖ్యమని జనసేన, తెలుగే లెస్స అని చిలక పలుకులు పలికిన వైసీపీ… తెలుగు జాతికి చేసింది నేడు తీరని ద్రోహం. రాజకీయాలకు అతీతంగా, అత్యున్నత పదవికి తెలుగు బిడ్డ పోటీ పడితే, ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేయించిన మూడు పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులు.” అని ఆమె నిప్పులు చెరిగారు.

ప్ర‌ధాని మోడీకి ఈ మూడు పార్టీల నాయ‌కులు మోకాళ్లు ఒత్తుతున్నార‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. తెలుగు బిడ్డ‌ను ప్రోత్స‌హించాల్సింది పోయి.. మోడీ చెప్పార‌ని.. ఆర్ఎస్ఎస్ వాదికి ఓటేస్తారా? అని ప్ర‌శ్నించారు. ఇది అత్యంత దారుణం, బాధాక‌ర‌మ‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో తెలుగు జాతికి జరిగిన ఘోర అవమానంగా పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా మూడు పార్టీల నాయ‌కుల‌కు ష‌ర్మిల కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. ఇదేస‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై మ‌రింత ఘాటుగా విరుచుకుప‌డ్డారు. సీబీఐ, ఈడీ కేసుల‌కు భ‌య‌ప‌డి జ‌గ‌న్‌.. మోడీకి మోక‌రిల్లాడ‌ని అన్నారు.

ష‌ర్మిల ప్ర‌శ్న‌లు ఇవీ..

  • తెలుగు ప్రజల ఆత్మగౌరవం కంటే మోడీతో స్వప్రయోజనమే ముఖ్యమా?
  • పోటీలు పడి మోడీ దగ్గర మోకరిల్లాల్సిన ఖర్మ ఎందుకు పట్టింది?
  • రాష్ట్రానికి బీజేపీ చేసిన మోసం మీకు కనిపించలేదా?
  • 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి గొంతు కోసిన విష‌యం గుర్తులేదా?
  • తెలుగు ప్ర‌జ‌ల జీవనాడి పోలవరం జీవం తీసేస్తే మీలో చలనం లేదా?
  • విశాఖ స్టీల్ ప్లాంటును అమ్మేస్తుంటే మీకు రోషం లేదా?

This post was last modified on September 10, 2025 10:01 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

31 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago