వ్యూహం లేని ఆర్థికం.. బుగ్గ‌న త‌ర్జ‌న భ‌ర్జ‌న‌!

రాష్ట్ర ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌ర రాజేంద్ర‌నాథ్ రెడ్డి.. త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారా? స‌ర్కారు పెడుతున్న ఖ‌ర్చుకు, వ‌స్తున్న రాబ‌డికి మ‌ధ్య పొంత‌న‌లేక‌పోవ‌డం ఆయ‌న‌ను క‌ల‌చివేస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నాయి వైసీపీ వ‌ర్గాలు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత చంద్ర‌బాబు హ‌యాంలో ఒకింత ఫ‌ర్వాలేదు.. అనుకున్న ఆదాయం.. ఇప్పుడు భారీగా త‌గ్గిపోయింది. ఒక్క మ‌ద్యంపై ఆదాయం మిన‌హా.. రిజిస్ట్రేష‌న్ల ద్వారా రెవెన్యూ శాఖ తెస్తున్న ఆదాయం చాలా చాలా త‌క్కువ‌గా ఉంటోంది.

ఇక‌, వ‌స్తున్న ఆదాయానికి.. పెడుతున్న ఖ‌ర్చుల‌కు మ‌ధ్య పొంత‌న ఉండ‌క‌పోగా.. ప్రాధాన్యాలు సైతం దెబ్బ ‌తింటున్నాయ‌నేది కొన్నాళ్లుగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన చేస్తున్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌. పైకి ఆయ‌న సైలెంట్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో మాత్రం సీఎం వైఖ‌రిని బుగ్గ‌న త‌ప్పుప‌డుతున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు జ‌రుగుతున్నాయి. కానీ.. అభివృద్ధి ఎక్క‌డా జ‌ర‌గ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. ర‌హ‌దారులు.. మౌలిక స‌దుపాయాలు.. ఎక్క‌డా ఒన‌గూర్చ‌లేక పోతున్నామ‌నేది బుగ్గ‌న ఆవేద‌న‌.

పైగా..భారీ స్థాయిలో ఉన్న సంక్షేమ ప‌థ‌కాల‌కే వ‌స్తున్న ఆదాయం స‌రిపోవ‌డం లేదని.. ఇప్పుడు ఆదాయ మార్గాల‌ను వెత‌కాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ పై ఒత్తిడి తెచ్చిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం నెల‌నెలా సామాజిక పింఛ‌న్ల‌కు, ఉద్యోగుల వేత‌నాల‌కు కూడా ప్ర‌భుత్వం ఇబ్బంది ప‌డుతున్న ప‌రిస్థితి ఉంది. అయితే.. తాను ప్ర‌క‌ట‌న‌లు గుప్పించ‌డం.. ఆర్థిక శాఖ వాటిని అమ‌లు చేసేందుకు నిధుల కోసం వెతుకులాడ‌డం..వంటి ప‌రిణామాల‌తో బుగ్గ‌నకు త‌ల బొప్పిక‌డుతున్నంత ప‌ని జ‌రుగుతోంద‌ని అంటున్నారు.

జ‌గ‌న్ వైఖ‌రి, ఆర్థిక అస‌మ‌తుల్య‌ ప‌రిస్థితి, పందేరాల వ‌ర‌ద‌ ఇలానే కొన‌సాగితే.. తానే స్వ‌యంగా ఈ ప‌ద‌వి నుంచి త‌ప్పుకొనే ప‌రిస్థితి ఉంటుంద‌ని బుగ్గ‌న భావిస్తున్నట్టు సీనియ‌ర్లు చెప్పుకొంటున్నారు. అయితే.. ఈ విష‌యం జ‌గ‌న్ వ‌ర‌కు వెళ్ల‌ని నేప‌థ్యంలో.. ఎటు మ‌లుపు తిరుగుతుందో.. ఏం జ‌రుగుతుందో చూడాలి. జ‌గ‌న్ త‌న హామీల‌ను అణుచుకుంటారా? లేక‌.. బుగ్గ‌న‌నే వ‌దులుకుంటారా? అనేదివైసీపీ వ‌ర్గాల్లో వినిపిస్తున్న గుస‌గుస‌!!