Political News

వైసీపీకి కార్య‌క‌ర్త‌లు.. దూర‌మా.. భార‌మా..?

వైసీపీలో కార్యకర్తలు కీలకమని, కార్యకర్తలను బలోపేతం చేస్తామని, వచ్చే ఎన్నికల నాటికి కార్యకర్తలకు ప్రాధాన్యం పెరుగుతుందని ఆ పార్టీ అధినేత జగన్ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో కార్యకర్తలను దూరం చేసుకుని.. కార్యకర్తలను ఇబ్బంది పెట్టి.. తాము ఓడిపోయామని ఆయన గతంలో ఒకటి రెండుసార్లు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల‌ సెంట్రిక్‌గా వైసీపీ రాజకీయాలు సాగుతాయని అందరూ అనుకున్నారు.

ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ తీసుకు వచ్చి కార్యకర్తలకు ప్రాధాన్యం లేకుండా చేశారన్నది గతంలో వచ్చిన ప్రధాన విమర్శ. ఇక.. ఇప్పుడైనా పార్టీలో పరిస్థితి మారిందా అంటే తాజాగా వెలుగు చూసిన అంశం.. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చేసిన విమర్శలను బట్టి కార్యకర్తలు జగన్ ను కలుసుకునేందుకు ప్రత్యేకంగా పాసులు, అనుమతులు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియకపోయినా.. మంత్రి నారా లోకేష్ విమ‌ర్శ‌ చేశారంటే నిజం లేకుండా చేయరు కాబట్టి ఇది వాస్తవమేనన్న చర్చ నడుస్తుంది.

కార్యకర్తలకు ప్రాధాన్యమిస్తామని చెబుతున్న జగన్ ఇట్లా పాసులు, అనుమతులు తీసుకొని తనను కలవాలని నిబంధన పెట్టి ఉంటే కనుక అది మరింతగా పార్టీని ఇబ్బంది పట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కార్యకర్తలకు స్వేచ్ఛ లేకపోతే ప్రజల్లోకి వెళ్ళలేరు. పార్టీని డెవలప్ చేయలేరు. పైగా కూటమి పార్టీలు బలంగా ఉన్న నేపద్యంలో వాటిని తట్టుకొని ప్రజల్లోకి వైసీపీని తీసుకు వెళ్లే బాధ్యతను భుజాలపై వేసుకునే పరిస్థితి కార్యకర్తలకు ఉండాలంటే జగన్ వైపు నుంచి వారికి సహకారం ప్రోత్సాహం మరింత ఎక్కువగా ఉండాలి.

అవి లేకుండా పాసులు -అనుమతులు అంటూ వారిని కట్టడి చేసే ప్రయత్నం జరిగితే ఖచ్చితంగా అది మరో పెద్ద ఇబ్బందికి దారి తీసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జగన్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ తరహా పరిస్థితి కనుక కొనసాగితే పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉంటుందన్నది ఆయన గుర్తించాలి. మరి ఈ సలహా ఎవరిచ్చారో ఏంటో తెలియకపోయినా.. నారా లోకేష్ చేసిన విమర్శలను బట్టి ఇది నిజమేన‌న్నది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. దీనిని ఎవాయిడ్ చేయాల్సిన అవసరం పార్టీకి ఎంతైనా ఉంది. కార్యకర్త‌లు కలుసుకునేందుకు, కార్యకర్తలను పార్టీ కార్యాలయంలోకి అనుమతించేందుకు మరింత ఎక్కువగా జగన్ చొరవ తీసుకోవాలి, లేకపోతే వారి ప్రజల్లోకి స్వేచ్ఛగా వెళ్లే పరిస్థితి కనిపించకపోవచ్చు.

This post was last modified on September 4, 2025 12:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

28 minutes ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

34 minutes ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

60 minutes ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

2 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

3 hours ago