కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో హరీష్ రావు పాత్ర ఉందంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి హరీష్ రావు, సంతోష్ లపై కవిత షాకింగ్ ఆరోపణలు చేశారు. పార్టీలో లబ్ధిపొందాలని అనుకుంటున్న కొందరితో కలిసి హరీష్ రావు కుట్ర పన్నుతున్నారని, కేసీఆర్ కుటుంబాన్ని విడగొట్టాలని చూస్తున్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లను విడగొట్టి పార్టీని హస్తగతం చేసుకోవాలని వారు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.
పార్టీని విచ్ఛిన్నం చేసి తాము సొంతం చేసుకోవాలన్న కుట్రతోనే పార్టీ నుంచి తనను తొలగించేలా చేశారని హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేపు ఇదే ప్రమాదం కేటీఆర్ కు, కేసీఆర్ కు పొంచి ఉందని, వారు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. టీఆర్ఎస్ స్థాపించిన మొదటి రోజు నుంచి హరీష్ రావు పార్టీలో లేరని, పార్టీ పెట్టిన 9 నెలల తర్వాత ఆయన పార్టీలో చేరారని గుర్తు చేశారు.
హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదని, బబుల్ షూటర్ అని ఎద్దేవా చేశారు. హరీష్ రావు ఒక సమస్యను సృష్టించి దానిని ఆయనే పరిష్కరించినట్లు చెప్పుకుంటారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి, హరీష్ రావుల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఎప్పుడో లొంగిపోయారని ఆరోపించారు. బీఆర్ఎస్ ను సంతోష్, హరీష్ రావు గ్యాంగ్ జలగల్లా పట్టిపీడిస్తున్నాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో హరీష్ రావు పేరును రేవంత్ రెడ్డి ఎందుకు ప్రస్తావించడం లేదని కవిత ప్రశ్నించారు.
This post was last modified on September 3, 2025 3:11 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…