Political News

సీఎం రేవంత్ రెడ్డి వాహ‌నాల‌కు 75 వేల రూపాయ‌ల‌ ఫైన్లు!

అదేంటి? అనుకుంటున్నారా? నిజ‌మే. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించ‌క‌పోతే.. హైద‌రాబాద్ పోలీసులు ఎవ‌ర‌నే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి చెలాన్లు విధిస్తున్నారు. ఈ విష‌యాన్ని గ‌తంలో సీఎం రేవంత్ రెడ్డే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ప్ర‌జ‌ల‌కు ట్రాఫిక్ ప‌ట్ల అవ‌గాహ‌న ఉండాల‌న్న ఆయ‌న‌.. ఎవ‌రు త‌ప్పుచేసినా.. జ‌రిమానాలు చెల్లించాల్సిందేన‌ని వ్యాఖ్యానించారు. చివ‌ర‌కు త‌ను త‌ప్పు చేసినా పోలీసులు ఆలోచ‌న చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. బ‌హుశ‌.. ఈ విష‌యం దృష్టిలో పెట్టుకున్నారో.. ఏమో.. ట్రాఫిక్ పోలీసులు.. సీఎంవోకు.. సుమారు 75 వేల రూపాయ‌ల ఫైన్ల‌కు సంబంధించిన చ‌లాన్ల‌ను పంపించారు.

సీఎం రేవంత్ రెడ్డి సాధార‌ణంగా.. ఒంట‌రిగా బ‌య‌ట‌కు రారు. ఆయ‌న సొంత వాహ‌నంలోనూ తిర‌గాల్సిన అవ‌స‌రం లేదు. అయిన ప్ప‌టికీ.. చ‌లాన్లు ఏంటి? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం కాకుండా ఉండ‌దు. అయినా.. సీఎం రేవంత్ రెడ్డికి చ‌లాన్లు ప‌డ్డాయి. ఎందుకంటే.. ఆయ‌న ప్ర‌యాణించిన కాన్వాయ్ వాహ‌నాలు ‘సీఎం’ పేరుతోనే చ‌లామ‌ణి అవుతాయి. వీటిలో మొత్తంగా 11 వాహ‌నాలు ఉంటాయి. ఒక్కొక్క‌సారి స‌మ‌యాన్ని బ‌ట్టి వీటిని 9, 7కి కూడా త‌గ్గిస్తారు. ఇది ప‌రిస్థితిని బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది. ఈ వాహ‌నాలు.. గ‌త ఆరు మాసాల్లో 18 సార్లు.. ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి హైద‌రాబాద్‌లో చ‌క్కర్లు కొట్టిన‌ట్టు పోలీసులు గుర్తించారు.

వీటికి సంబంధించిన సీసీ కెమెరా కాప్చ‌ర్ చేసిన ఫొటోల‌ను నిశితంగా గ‌మ‌నించి.. మ‌రో 20 ఉల్లంఘ‌న‌ల‌ను లైట్ తీసుకుని తీవ్రంగా ఉన్న 18 ఉల్లంఘ‌న‌ల‌కు మాత్ర‌మే చ‌లాన్లు క‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి ట్రాఫిక్ డీసీపీ పంపించారు. ఈ ఉల్లంఘ‌న‌ల్లో ప్ర‌ధానంగా అస‌లు సీఎం లేకుండానే..కాన్వాయ్ వాహ‌నాలు తిర‌గ‌డం. ఇలా చేయ‌కూడ‌దు. దీంతో సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగింది. ఇక‌, ఔట‌ర్ రింగ్ రోడ్డుపై అర్ధ‌రాత్రి కూడాఈ వాహ‌నాలు హ‌ల్చ‌ల్ చేయ‌డం. నిజానికి సీఎం లేన‌ప్పుడే వాహ‌నాలు తిప్ప‌కూడ‌ద‌ని ఉంటే.. అర్ధ‌రాత్రి తిప్ప‌డం.. అది కూడా రింగ్ రోడ్డుపై తీసుకురావ‌డం వంటివి సంచ‌ల‌నంగా మారాయి. ఈ క్ర‌మంలో 18 చ‌లాన్ల‌కు సంబంధించి సుమారు 75 వేల రూపాయ‌లు క‌ట్టాల‌ని నోటీసులు ఇచ్చిన‌ట్టు సీఎంవో వ‌ర్గాలు చెబుతున్నాయి.

This post was last modified on September 2, 2025 9:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

2 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

4 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

4 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

4 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

6 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

7 hours ago