ఏపీ సీఎం చంద్రబాబు.. అసెంబ్లీ సమావేశాలను ముందే వేడెక్కించేశారు. ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాలకు రావాలని .. వైసీపీ అధినేత జగన్‌ను అసెంబ్లీ స్పీకర్ .. అయ్యన్న పాత్రుడు ఇప్పటికే ఆహ్వానించారు. అయితే.. జగన్ వస్తారా? రారా ? అనేది ఇప్పటికీ సస్పెన్షన్‌లోనే ఉంది. ఇదిలావుంటే.. ఈ సమావేశాలకు సంబంధించి… చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
తాజాగా రాజంపేటలో పర్యటించిన చంద్రబాబు.. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. “దమ్ముంటే.. సభకురావాలి ” అని చంద్రబాబు వైఎస్ జగన్‌ను ఉద్దేశించి సవాల్ రువ్వారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. చంద్రబాబు వైపు నుంచి క్లారిటీ వచ్చేసింది. వైసీపీ ఎలాంటి అం శం లేవనెత్తినా.. తాము చర్చించేందుకు రెడీగా ఉన్నామన్న సంకేతాలు ఇవ్వడం కాదు.. తేల్చి చెప్పేశారు. అంతేకాదు.. ఇప్పటి వరకు తమకు మైక్ ఇవ్వరని.. చెబుతూ వచ్చిన జగన్‌కు ఆయన భారీ కౌంటర్ ఇచ్చారు.
సాధారణంగా సభలో ఏదైనా అంశంపై చర్చ వచ్చినప్పుడు ప్రతిపక్షానికి మైక్ ఇస్తారు. కానీ, ఇప్పుడు చంద్రబాబే స్వయంగా రావాలని కోరుతున్న సమయంలో ఈ మైకు మరింత ఎక్కువ సమయం ఇచ్చే అవకాశం లభిస్తుంది. దీనిని జగన్ సద్వినియోగం చేసుకునే అవకాశం వదులుకుంటే.. అది చంద్రబాబు కు మరో ఆయుధంగా మారే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఏ అంశంపై అయినా.. అంటూ.. చంద్రబాబే చెప్పిన దరిమిలా.. ఇప్పుడు జగన్‌కు కూడా మంచి చాన్స్ లభించింది.
తాను లేవనెత్తుతున్న అనేక అంశాలను చంద్రబాబుకు సంధించే అవకాశం కూడా జగన్‌కు ఏర్పడింది. సంక్షేమ పథకాల నుంచి అభివృద్ధి వరకు కూడా చంద్రబాబు చర్చకు రెడీ అయిపోయారు. ఇప్పుడు వైసీపీ అధినేత ఇంట్లో కూర్చొని మీడియా మీటింగులకు మాత్రమే పరిమితం అయితే.. అది శోభించదు. పైగా.. స్వయంగా చంద్రబాబే సవాల్ రువ్వడం ఇది ఫస్ట్ టైమ్. దీనిని ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు కూడా సభకు వెళ్లకపోతే.. అది జగన్ పిరికితనానికి నిదర్శనమనే చర్చ వచ్చినా.. ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అంటున్నారు పరిశీలకులు మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 2, 2025 9:04 pm
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…
సరిగ్గా మూడు నెలల ఇరవై ఎనిమిది రోజుల క్రితం పెద్ది రిలీజయ్యింది. ఒకే సినిమా అనుభవమున్న దర్శకుడు బుచ్చిబాబుని నమ్మి…
డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, దర్శకుడు కం హీరోగా మారి, హారర్ కామెడీ అనే కొత్త జానర్ సృష్టించి,…
ఆర్థిక వ్యవహారాలు రక్త సంబంధీకులు, తోడబుట్టిన వాళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టే ఉదంతాలు ఎన్నో చూస్తుంటాం. సెలబ్రెటీల్లో కూడా…
సామాన్య జనాల్లోనే కాదు.. ఇండస్ట్రీ ప్రముఖుల్లోనూ పెద్ద సంఖ్యలో వీరాభిమానులను సంపాదించుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాము…
ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించిన ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..…