2017లో సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కర్నూలులోని హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ కు ప్రీతి ఉరి వేసుకుని మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ ముందుకు సాగలేదు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రీతి కేసు విచారణ వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం హామీనిచ్చింది. ఆ మాట ప్రకారమే తాజాగా సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
2024 ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగిస్తామని ఇచ్చిన హామీని నేడు నిలబెట్టుకుంది. సుగాలి ప్రీత కుటుంబానికి న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రీతి తల్లిదండ్రులకు హామీనిచ్చారు. అయితే, సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం వాడుకున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. పవన్ ను కలిసేందుకు తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ సుగాలీ ప్రీతి తల్లి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఆ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఈ కేసును తానే బయటకు తెచ్చానని, ప్రీతికి న్యాయం చేయాలని పోరాడానని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.
This post was last modified on September 2, 2025 8:13 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…