బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయురాలు ఎమ్మెల్సీ కవిత కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీపై, కొందరు బీఆర్ఎస్ నాయకులపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తిస్తున్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్, కృష్ణారెడ్డిలపై కవిత చేసిన వ్యాఖ్యలతో ఆ విమర్శలు తార స్థాయికి చేరాయి ఈ నేపథ్యంలోనే తాజాగా కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా బీఆర్ఎస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.
క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన కవితపై పార్టీ వేటు వేసింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ సుదీర్ఘ చర్చల అనంతరం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Gulte Telugu Telugu Political and Movie News Updates