Political News

తెలంగాణ స‌భా స‌మ‌రం ముహూర్తం రెడీ..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం పెట్టారు. ఈ నెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా స్పీకర్ ప్రసాదరావు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలను చర్చించాలనే విషయంపై సమావేశాలు ప్రారంభమైన రెండో రోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీనికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు.

సమరం ఖాయం!

వర్షాకాల సమావేశాల విషయానికి వస్తే అధికార పక్షం, విపక్షం బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం తప్పదని స్పష్టంగా కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పినాకి చంద్రఘోష్ ఇచ్చిన నివేదికను సభలో ప్రవేశపెట్టి దీనిపై చర్చించి మాజీ సీఎం కేసీఆర్ పాలన బాగోతాన్ని తెలంగాణ సమాజానికి వివరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారు. దీనిపై ఖచ్చితంగా బీఆర్‌ఎస్ అడ్డుతగలడంతోపాటు ఇటీవలి పరిణామాలను కూడా ప్రస్తావించనుంది. దీంతో సభ వాడివేడి చర్చలకు వేదిక కానుంది.

ఇక బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ సారైనా సభకు వస్తారా, రారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. గతంలో ఒక్కసారి మాత్రమే ఆయన సభకు వచ్చారు. అది కూడా బడ్జెట్ సమావేశాల సమయంలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ 20 నెలల కాలంలో ఒక్కసారి కూడా సభకు రాలేదు. అనేకసార్లు సీఎం రేవంత్ రెడ్డి సహా స్పీకర్ ప్రసాదరావులు వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ రావాలని విన్నవించారు. అంతేకాక బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు సవాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో ఈ దఫా కేసీఆర్ వస్తారా, రారా అనేది చూడాలి.

మరోవైపు బీఆర్‌ఎస్ కూడా తమ పార్టీ తరఫున విజయం సాధించి కాంగ్రెస్‌లో చేరిపోయిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్న పట్టుదలతో ఉంది. దీనిపై ఇటీవల సుప్రీంకోర్టు కూడా స్పీకర్‌కు గడువు విధించింది. ఈ క్రమంలో ఆయన ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పరిణామాల క్ర‌మంలో మరోసారి ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ సభలో లేవనెత్తడం ఖాయమని తెలుస్తోంది.

తద్వారా ఇరుపక్షాల మధ్య వాడివేడి మాటల యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా హైడ్రా, హైదరాబాద్‌లో జరుగుతున్న హత్యలు, దొంగతనాలు వంటి అంశాలు కూడా బీఆర్‌ఎస్‌కు ఆయుధాలుగా మారనున్నాయి.

This post was last modified on August 28, 2025 12:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

40 minutes ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

1 hour ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

2 hours ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

2 hours ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

3 hours ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

5 hours ago