వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తొలిసారి వినాయక చవితి పూజలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏటా గణపతి ఉత్సవాలు నిర్వహించినా, దానికి ఆయన కడుదూరంగా ఉంటారు. గత ఏడాది కూడా వైవీ సుబ్బారెడ్డి సహా కొందరు పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొనగా, జగన్ మాత్రం వినాయక చవితి వేడుకలకు దూరంగా ఉన్నారు.
కానీ, ఈసారి మాత్రం ఆయనే నేరుగా ఈ పూజల్లో పాల్గొనడం, స్వామివారి కథ వినడం, చివరన ప్రసాదం కూడా తినడం ఆశ్చర్యంగా అనిపిస్తోందని పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఏం జరిగింది?
వైసీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వరసిద్ధ వినాయకుని ఆశీర్వచనాలు పొంది ప్రసాదం స్వీకరించారు. ప్రజలందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి విజయాలు లభించేలా ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు ఈ సందర్బంగా జగన్ పేర్కొన్నారు. ప్రజలందరికీ ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు.
స్వామి సలహాయేనా?
మరోవైపు, జగన్ ఇలా వినాయక చవితి వేడుకల్లో పాల్గొని పూజలు చేయడం వెనుక ఆయన మనసుకు నచ్చిన విశాఖకు చెందిన పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఉండి ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పార్టీ పరిస్థితితోపాటు వ్యక్తిగతంగా కూడా జగన్ ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారని అంటున్నారు.
వాస్తవానికి ఆది నుంచి క్రిస్టియానిటీలో ఉన్న జగన్ ఎప్పుడూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా తాము చూడలేదని సీనియర్లు చెబుతున్నారు. కేవలం ఓ సందేశం ఇచ్చి ఊరుకుంటారని, కానీ ఈ దఫా మాత్రం ఆయన నేరుగా పూజల్లో పాల్గొన్నారని తెలిపారు. కాగా జగన్ సతీమణి భారతి మాత్రం ఈ పూజలకు దూరంగా ఉన్నారు.
This post was last modified on August 27, 2025 4:35 pm
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…