వైసీపీలో కొంతమంది నాయకుల పరిస్థితి తీవ్ర ఇబ్బందిగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు వారు వ్యవహరించిన తీరు కావచ్చు, వారి నోటి దురుసు కావచ్చు.. కారణాలు ఏవైనా మరో మూడు సంవత్సరాల వరకు వారు బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కొంతమంది నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలపై వ్యక్తిగత దూషణలకు దిగడం, వ్యక్తిగత విమర్శలు చేయడం, అదేవిధంగా బూతులతో విరుచుకుపడడం వంటివి తెలిసిందే. తద్వారా వారు సాధించింది ఏమీ లేకపోగా వ్యక్తిగతంగా వారి పరువును కూడా పోగొట్టుకున్నారు.
ఇలాంటి వారిలో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గుడివాడ అప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని, నెల్లూరు సిటీ అప్పటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు కీలకంగా నిలిచారు. వీరు నోరు విప్పితే టిడిపి నేతలపైన, జనసేన నాయకులపైన విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆయా పార్టీల అధినేతలు, ద్వితీయశ్రేణి కీలక నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బూతులతో విరుచుకుపడ్డారు. ఫలితంగా వారిపై తీవ్ర విమర్శలు వచ్చినా మార్పు అయితే కనిపించలేదు. ఇది చివరకు ఎన్నికల్లో ఓటమికి కూడా దారితీసింది.
ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అనేది చూసుకుంటే.. పార్టీ ఓటమిపాలైన ఏడాదిన్నర తర్వాత కూడా ఇప్పటివరకు ఈ నాయకులు ఎవరు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. పార్టీ తరపున గళం వినిపించింది కూడా లేదు. ఇటీవల కాలంలో అనిల్ కుమార్ కొంతమేరకు మాట్లాడినప్పటికీ ఆయన మీద కూడా గనుల కేసు నమోదయింది. దీంతో ఆయన కూడా సైలెంట్ అయ్యారు. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఎలాంటి కేసులు ఇప్పటివరకు నమోదు కాకపోయినా బియ్యం అక్రమ రవాణా కేసులు మాత్రం ఎదురుచూస్తున్నాయి. ఇక కొడాలి నాని విషయంలో కేసుల పరంపరకు లెక్కే లేకుండా పోయింది.
కానీ ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నాయకులంతా ఇప్పట్లో మీడియా ముందుకు వచ్చే పరిస్థితి కానీ ప్రజల్లోకి వచ్చే పరిస్థితి కానీ కనిపించకపోవడం, మరో మూడేళ్లపాటు పరిస్థితి ఇలాగే ఉండడం వంటివి స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిని పార్టీ కూడా ఎటువంటి బలవంతం చేయడం లేదు. మీరు ప్రజల్లోకి రండి, పార్టీ తరఫున వాయిస్ వినిపించండి అని పార్టీ అధినేత కూడా ఎక్కడా చెప్పకపోవడం మరో విషయం. ఏదేమైనా ఫైర్ బ్రాండ్లుగా చలామణి అయిన వారు వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రంగా మారడం, వివాదాలకు కేంద్రంగా మారడంతో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందన్నది వాస్తవం.
This post was last modified on August 26, 2025 9:54 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…