దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కలు పెరిగిపోయాయని.. వీటిని 8 వారాల్లో ఖాళీ చేయించి.. నగరానికి దూరంగా ఎక్కడైనా వదిలేయాలని పేర్కొంటూ.. ఈ నెల 11న ఇచ్చిన సుప్రీంకోర్టు సంచలనం రేపింది. అంతే కాదు.. ఒక్క కుక్క కనిపించినా.. అధికారులపై భారీ జరిమానాలు విధిస్తామని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక అక్కడితోనూ అప్పట్లో శాంతించలేదు. తాము ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేయడానికి వీల్లేదని కూడా స్పష్టం చేసింది. అలా ఎవరైనా సవాల్ చేస్తే.. భారీ జరిమానాలకు సిద్ధమై కోర్టుకు రావాలని తేల్చి చెప్పింది.
అయితే.. సుప్రీంకోర్టు ఎన్ని చెప్పినా.. బాలీవుడ్ నుంచి దేశవ్యాప్తంగా.. అన్ని రాష్ట్రాల్లోనూ జంతు ప్రేమికులు కదం తొక్కారు. కుక్కలకు రక్షణగా నిలిచారు. సుప్రీంకోర్టు తీర్పును రివైజ్ చేయాలని బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు కూడా అనేక మంది లేఖలు రాశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తాజాగా గత 11వ తేదీన ఇచ్చిన తీర్పును రివైజ్ చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం ఢిల్లీలో కుక్కలు ఉండేందుకు అనుమతి ఇచ్చింది.
అయితే.. కేవలం రెబీస్ వ్యాధి సోకిన కుక్కలను మాత్రం నగరానికి కడుదూరంగా పంపించేయాలని ఆదేశించింది. అదేసమయంలో నగరంలో ఉండే కుక్కలకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాలని, వ్యాక్సిన్ ఇవ్వాలని, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని కూడా ఆదేశించింది. వీధుల్లో తిరిగే కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఆహారం పెట్టడానికి వీల్లేదని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆహారం పెట్టేందుకు స్థానిక కార్పొరేషన్ అధికారులు వేరే షెల్టర్లు ఏర్పాటు చేయాలని సూచించింది.
ఇవీ ముఖ్యాంశాలు
This post was last modified on August 22, 2025 9:58 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…