Political News

త‌మిళ‌నాట స్ట్రాట‌జీ.. తంబిల‌కు మోడీ చెక్‌!

రాజ‌కీయాల్లో ఎత్తుల‌కు పై ఎత్తులు ఎప్పుడూ ఉంటాయి. ఎన్నిక‌ల‌కు ముందు అయితే ఈ వ్యూహాల‌కు మ‌రింత ప‌దును కూడా పెడ‌తారు. ఇప్పుడు త‌మిళ‌నాడులోనూ ఇదే త‌ర‌హా పాలిటిక్స్ సాగుతున్నాయి.

వ‌చ్చే ఏడాది త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. ప్ర‌స్తుతం ద‌క్షిణాదిలో ఉన్న అతి పెద్ద అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రం త‌మిళ‌నాడు. ఈ రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక ఏపీలో 175, తెలంగాణ‌లో 117, క‌ర్ణాట‌క‌లో 224, కేర‌ళ‌లో 140 ఉన్నాయి.

అంటే ద‌క్షిణాదిలో ఎక్కువ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం త‌మిళ‌నాడు. ఇక్కడ పాగా వేయాల‌న్నది బీజేపీ రెండు ద‌శాబ్దాలుగా చేస్తున్న ప్ర‌య‌త్నం. గ‌తంలో జ‌య‌ల‌లిత‌పై ఒత్తిడి కూడా తెచ్చారు. ఆ త‌ర్వాత అన్నాడీఎంకేను చీల్చి లాభం పొందాల‌నే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఆ ప్ర‌య‌త్నాలు ఫ‌లించలేదు.

గ‌త రెండేళ్ల కింద‌ట త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ద్వారా కొత్త పార్టీ పెట్టించి దానిని త‌మ‌కు మ‌ద్ద‌తుగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ విష‌యంలో ర‌జ‌నీ ముందు మొగ్గు చూపినా త‌ర్వాత రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పారు.

ఇప్పుడు మ‌రో రూపంలో బీజేపీ త‌మిళ ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలోనే హీరో విజ‌య్ కొత్త పార్టీతో తెర‌మీదికి వ‌చ్చారు. వాస్త‌వానికి పైకి ఆయ‌న బీజేపీని తిట్టిపోస్తున్నా అంత‌ర్గ‌తంగా మాత్రం క‌మ‌లనాథుల క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నార‌న్న చ‌ర్చ జోరుగా ఉంది.

స్థానికంగా ఉన్న ద్రవిడుల బ‌ల‌మైన ఓటు బ్యాంకును విజ‌య్ ద‌క్కించుకుంటే దీనిని ఆస‌రాగా చేసుకుని బీజేపీ చెలిమి చేసే అవ‌కాశం ఉంది. అందుకే విజ‌య్ వ్యూహాత్మ‌కంగా తాను ఏ పార్టీకి చెందిన నాయ‌కుడిని కాద‌ని, సొంత నేత‌నేన‌ని ప‌దే ప‌దే ప్ర‌క‌టించే ప‌రిస్థితి వ‌చ్చింది.

తాజాగా కూడా విజ‌య్ త‌న పార్టీ త‌మిళ‌గ వెట్రి క‌గ‌ళం (టీవీకే) బీజేపీ, డీఎంకేల‌కు అతీతంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. అంతేకాదు ఈ క్ర‌మంలో ఆయ‌న చేసిన వ్యాఖ్యలు ముందు ముందు పొత్తును నిర్ధారిస్తున్నాయ‌న్నది విశ్లేష‌కుల అభిప్రాయం.

తాను బీజేపీ భావ‌జాలంతో మాత్ర‌మే విభేదిస్తాన‌ని చెప్పారు. కానీ డీఎంకేతో (అధికార పార్టీ) మాత్రం అన్ని విష‌యాల్లోనూ పోరాటం చేస్తాన‌న్నారు. సో భావ‌జాలం ప్రాతిప‌దిక రేపు మారే అవ‌కాశం ఉంటుంది.

అంశాల వారీ మ‌ద్ద‌తు కూడా ఉండొచ్చు. కాబ‌ట్టి విజ‌య్ అడుగులు చూస్తే మోడీ క‌నుస‌న్న‌ల్లో, బీజేపీ బాట‌పైనే ప‌డుతున్నాయ‌న్నది త‌మిళ మీడియా చెబుతున్న మాట. మ‌రి ఈ పోరులో డీఎంకే నేతృత్వంలోని కాంగ్రెస్ కూట‌మి ఏమేర‌కు త‌ట్టుకుని నిల‌బ‌డుతుందో చూడాలి.

This post was last modified on August 22, 2025 10:53 am

Share

Recent Posts

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

7 minutes ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

49 minutes ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

2 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

3 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

3 hours ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

5 hours ago