Political News

‘శ్రీవారి ప్రసాదాలు తిని మాట్లాడండి జగన్, భారతి’

తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యత తగ్గిపోయిందని, అన్న ప్రసాదాల్లో అసలు నాణ్యత కొరవడిందని వైసీపీ అధినేత జగన్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదు. భక్తులు శ్రీవారి ప్రసాదాలను ఎంతో భక్తి ప్రపత్తులతో స్వీకరిస్తున్నారు. నాణ్యత బాగుందని కూడా చెబుతున్నారు. మీరు ఏనాడైనా తిరుమలకు వచ్చారా? నిత్యాన్నదాన సత్రంలో కూర్చుని తిరుమల శ్రీవారి ప్రసాదాలు తీసుకున్నారా? చెప్పండి. ఇప్పుడు చెబుతున్నా, జగన్, భారతి లు స్వయంగా తిరుమలకు రండి. ఇక్కడి ప్రసాదాలు రుచి చూడండి. అప్పుడు మాట్లాడండి. అని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు సవాల్ విసిరారు.

అంతేకాదు, సాక్షి పత్రిక, టీవీ ఛానెల్‌లో తనపై వ్యక్తిగా కుట్ర కథనాలను ప్రసారం చేస్తున్నారని, ప్రచురిస్తున్నారని నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10, 14 తేదీల్లో ప్రచురించిన, ప్రసారం చేసిన వాటిపై లీగల్ నోటీసులు పంపించనున్నట్టు చెప్పారు. తన వ్యక్తిగత పరువుకు భంగం కలిగించినందుకు 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని నాయుడు తెలిపారు.

మరోవైపు, తిరుమల కొండ పవిత్రతను కాలరాస్తున్నారని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.

నిజానికి తిరుమల ఇప్పుడు పవిత్రంగానే ఉంది. వైసీపీ హయాంలో ఉన్నట్టుగానే ఉందని వారు భ్రమలో ఉన్నారు. అందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. అని నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అన్ని విషయాల్లోనూ తిరుమలను వైసీపీ నేతలు భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. తిరుమలలో హోటళ్లను తమ వారికి కట్టబెట్టారని, ఫలితంగా శ్రీవారి హుండీకి రావాల్సిన ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని నాయుడు చెప్పారు.

తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పైనా నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన అవినీతి చిట్టా తన వద్ద ఉందని తెలిపారు. లేనిపోని విమర్శలు చేసి టీటీడీ పరువు తీయాలని భావిస్తున్నారని, ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.

మాజీ మంత్రి రోజా కూడా తిరుమల టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. దీనిపై కూడా కూపీ లాగుతున్నట్టు నాయుడు తెలిపారు. “వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నెన్ని టికెట్లు ఎవరికిచ్చారో నాకు తెలుసు. రోజా టూరిజం ముసుగులో ఒక్కో దర్శన టికెట్‌ను రూ.5 వేలకు అమ్ముకున్నారు. తిరుమలలో ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా?’’ అని నాయుడు సవాల్ విసిరారు.

This post was last modified on August 21, 2025 4:14 pm

Share

Recent Posts

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

27 minutes ago

టాక్సిక్ జీవోలు… దాటాల్సిన సవాళ్లు

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…

33 minutes ago

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

2 hours ago

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

3 hours ago

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…

5 hours ago

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

5 hours ago