Political News

అన్న ఇంటికి షర్మిల వెళ్తారా?

వైసీపీ అధినేత జగన్ ఇంటికి ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రానున్నారా? ఆయనతో ప్రత్యేకంగా చర్చించనన్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ. సుదర్శన్ రెడ్డిని నామినేట్ చేసింది. గురువారం ఆయన నామినేషన్ కూడా వేయనున్నారు. అయితే రాజకీయాలతో సంబంధం లేని సుదర్శన్ రెడ్డిని కేవలం నిలబెట్టి చేతులు దులుపుకోనందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు.

ఈ క్రమంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు బలమైన పోటీ ఇచ్చేలా వ్యవహరించాలనీ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తమ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా తెలుగు వారైన సుదర్శన్ రెడ్డికి మెజారిటీ ఓట్లు పడేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయించుకుంది.

దీనిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపీలను ఒప్పించే బాధ్యతను ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లకు పార్టీ అధిష్టానం అప్పగించింది. ఈ క్రమంలో ఏపీ చీఫ్ షర్మిల కార్యరంగంలోకి అడుగు పెట్టనున్నారు.

దీనిలో భాగంగా ఇప్పటికే ఒక సుదీర్ఘ ప్రకటన చేసిన షర్మిల ఉత్తరాది రాష్ట్రాలకు కొమ్ము కాయని పార్టీలు అయితే అంటూ టీడీపీ, జనసేన, వైసీపీలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పార్టీలు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కూడా ఆమె పిలుపునిచ్చారు. అంతేకాదు ఆమె నేరుగా ఆయా పార్టీల అధినేతలను కలుసుకునేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నట్టు సమాచారం.

ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రచారానికి ఇంకా సమయం ఉండడం, వచ్చే నెల 9న ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపధ్యంలో టీడీపీ, జనసేన, వైసీపీ అధినేతలను షర్మిల నేరుగా కలుసుకునేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.

పార్టీ అధిష్టానం సూచనల మేరకు షర్మిల టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లను నేరుగా కలుసుకుని తమ తమ ఎంపీలను సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇచ్చేలా వారిని అభ్యర్థించారు.

ఇంతవరకు ఎలాంటి ఇబ్బందిలేకపోయినా వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్ నివాసానికి కూడా షర్మిల రానుండడం మాత్రం సంచలనంగా మారింది. ఆయనతో ఉన్న విభేదాల గురించి తెలిసిందే. అయినా పార్టీ అధిష్టానం సూచనల మేరకు షర్మిల షెడ్యూల్ ప్రకారం జగన్ నివాసానికి వచ్చి ఆయనకు ఉన్న లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల మద్దతును కోరనున్నారు. మరి జగన్ ఏమేరకు రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on August 21, 2025 4:12 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

2 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

2 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

3 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

3 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

4 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

4 hours ago