సొంత పార్టీలోని కొందరు నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొద్ది రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ కు తాను రాసిన లేఖ లీక్ కావడంపై కవిత అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఇక ఆ లేఖలో కవిత పేర్కొన్న విషయాలు పార్టీలోని అంతర్గత కలహాలకు అద్దంలా మారాయి. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించేలా ఉన్న ఆ లేఖ బీఆర్ఎస్ వర్గాల్లో దుమారం రేపింది. ఆ లేఖ తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కవితతో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీలోని కొందరు కుట్రదారులు తనను రకరకాలుగా వేధిస్తున్నారని కవిత షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ కుట్రదారులను బయటపెట్టాలని కోరితే తనపై కక్షగట్టారని వాపోయారు. ఆ కుట్రదారులే ఆ లేఖను తాను అమెరికా వెళ్లిన సమయంలో లీక్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసని అన్నారు. తాను అమెరికాలో ఉన్నప్పుడే గౌరవ అధ్యక్ష ఎన్నిక జరిగిందని, చట్టవిరుద్ధంగా బీవీజేకేఎస్ సమావేశం నిర్వహించి ఎన్నుకున్నారని కవిత ఆరోపించారు. కార్మికుల చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారని ఆరోపించారు.
సింగరేణి కార్మికుల కోసం తాను పోరాడుతుంటే తనపై కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ ప్రకారం సింగరేణి గని కార్మికులకు కవిత బహిరంగ లేఖ రాశారు. టీవీజేకేఎస్ గౌరవాధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ కు శుభాకాంక్షలు తెలిపారు. మరి కవిత కామెంట్లపై బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on August 21, 2025 4:05 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…