వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ జరుపుతున్న ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఉరఫ్ రాజ్ కసిరెడ్డి ఆస్తులను జప్తు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఆది నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే లిక్కర్ కుంభకోణం ద్వారా ఆయన అక్రమ మార్గంలో కోట్ల రూపాయలు పోగేసుకున్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ సొమ్మును వైట్ చేసుకునేందుకు పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్టు మద్యం కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుర్తించారు. సినిమాలు సహా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ కసిరెడ్డి పెట్టుబడులు పెట్టినట్టు తెలుసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా 13 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడా రాజ్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఆయా వివరాలను ప్రభుత్వానికి అందించారు. దీంతో రాజ్ కసిరెడ్డి ఆస్తులను సీజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు ఆస్తులను సీజ్ చేసిన ఘటన ఇదే కావడం గమనార్హం. అదే విధంగా కీలక నేతలు, ఉన్నతాధికారులను కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేసినా వారి ఆస్తులపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవలి శంషాబాద్ శివారులో గుర్తించిన 11 కోట్ల రూపాయలను కోర్టు ఆదేశాల మేరకు బ్యాంకులో జమ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు నిందితుల్లో నంబర్ వన్‌గా ఉన్న రాజ్ కసిరెడ్డి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
This post was last modified on August 21, 2025 4:06 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…