హైదరాబాద్ నగరంలో భూముల ధరలు మళ్లీ చర్చకు తెరలేపాయి. హెచ్‌ఎండీఏ తాజాగా ఆన్‌లైన్ వేలానికి నోటిఫికేషన్ జారీ చేస్తూ కనీస ధరలను భారీగా పెంచింది. ముఖ్యంగా కోకాపేట నియోపొలిస్ ప్రాంతంలో చ.గజం రూ.1.75 లక్షలుగా ధర నిర్ణయించడం రియల్ ఎస్టేట్ వర్గాల్లో షాక్ ఇచ్చింది. గతంలో ఇదే ధర రూ.65 వేలుగా ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా రెండింతలు కంటే ఎక్కువ పెరగడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
కోకాపేటలో ప్రభుత్వ భూములు ఎప్పటినుంచో హాట్‌టాపిక్ గా నిలుస్తున్నాయి. సర్వే నెంబర్ 144లో ఉన్న 8,591 చ.గజాల భూమి ప్రస్తుతం వేలం కోసం సిద్ధంగా ఉంది. కొత్త కనీస ధర ప్రకారం ఈ భూమి విలువ రూ.150 కోట్లకు పైగా ఉంటుంది. అయితే వాస్తవ వేలంలో ధర ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. గతంలో ఇదే ప్రాంతంలో ఓ ఎకరా భూమి రూ.100 కోట్లకు అమ్ముడైన సంఘటన ఇంకా గుర్తుండగానే ఉంది.
ఇక బాచుపల్లి, బైరాగిగూడ, చందానగర్, పుప్పాలగూడ వంటి ప్రాంతాల్లో కూడా కనీస ధరలు పెరిగాయి. బాచుపల్లిలో చ.గజానికి రూ.70 వేలుగా, బైరాగిగూడలో రూ.75 వేలుగా ధర నిర్ణయించారు. ఈ ధరలు గతం కంటే రెండింతలు పెరగడం గమనార్హం. రియల్ ఎస్టేట్ డిమాండ్, ఐటీ కారిడార్ విస్తరణ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కారణంగా ధరలు ఇంతకంతకూ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
గతంలో మోకిలలో జరిగిన వేలం అనుభవం అధికారులు మరిచిపోలేదు. అప్పుడు చాలామంది ఎక్కువ ధరలు చెప్పి తరువాత డబ్బులు చెల్లించక వెనక్కు తగ్గారు. తమ భూముల ధరలు పెరగడానికే అలాంటి ప్రయత్నాలు జరిగాయని అధికారులు గుర్తించారు. అందుకే ఈసారి భారీ డిపాజిట్ తప్పనిసరి చేశారు. కోకాపేటలో 8,591 చ.గజాల భూమి వేలంలో పాల్గొనాలంటే రూ.5 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే. మొత్తంగా, కోకాపేటతో పాటు ఇతర ప్రాంతాల్లో కనీస ధరలు పెరగడం రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త చర్చను తెచ్చింది.
This post was last modified on August 21, 2025 10:23 am
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…