Political News

మరి అమిత్ షా కూడా అరెస్ట్ అయ్యారు గా

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బిల్లు రాజకీయ వర్గాల్లోనే కాక దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. కనీసం ఐదేళ్ల శిక్షకు గురయ్యే నేరారోపణలపై అరెస్టయి వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు తమ పదవిని ఆటోమేటిక్‌గా కోల్పోవాలని ఇందులో ప్రతిపాదించారు.

31వ రోజు నుంచే ఆ నిబంధన అమల్లోకి వస్తుందని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాజీనామా చేయకపోయినా ఈ చట్టం ప్రకారం వారి పదవి రద్దయిపోతుందని బిల్లులో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనతో లోక్‌సభలో గట్టి వాదోపవాదాలు జరిగాయి. విపక్షాలు బిల్లుకు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి.

నిరపరాధి అని నిరూపించుకునే వరకు ఎవరైనా నిర్దోషి అన్నది భారత చట్ట వ్యవస్థలో ప్రాథమిక సూత్రమని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ గుర్తుచేశారు. కానీ ఈ బిల్లు ఆ సూత్రాన్నే మార్చేసేలా ఉందని ఆయన విమర్శించారు. అసదుద్దీన్ ఒవైసీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, “ఇది అధికారాల విభజన సూత్రానికి విరుద్ధంగా ఉంది. కార్యనిర్వాహక వ్యవస్థలు న్యాయమూర్తిలా, జ్యూరీలా, శిక్ష అమలు చేసేవారిలా మారిపోతాయి. ఈ నిబంధనను ప్రభుత్వాలను అస్థిరం చేయడానికి సులభంగా వాడుకోవచ్చు” అని హెచ్చరించారు.

సభలో గందరగోళం పెరిగే స్థాయికి వెళ్లింది. విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దిగారు. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా స్వయంగా అరెస్టయిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన అమిత్ షా, “అప్పుడు నేను నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేశాను. కోర్టు నన్ను నిర్దోషిగా తేల్చాకే తిరిగి ప్రభుత్వంలో చేరాను” అని చెప్పారు.

అమిత్ షా బిల్లులను హడావుడిగా తీసుకురాలేదని, సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ, విపక్షాలు ఈ బిల్లును పార్లమెంట్‌లోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా, ఇది రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని, ఎన్నికైన ప్రభుత్వాల స్థిరత్వానికి ముప్పు అని వాదిస్తున్నాయి.

మొత్తం మీద, ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే రాజకీయ రంగంలో పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవైపు అవినీతిని, నేరారోపణలను అడ్డుకునే పాజిటివ్ అంచనా ఉన్నా, మరోవైపు నిర్దోషులైన నేతలు రాజకీయంగా నష్టపోయే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ బిల్లుపై తుది నిర్ణయం ఇంకా రావాల్సి ఉంది కానీ, ఇది రాబోయే రోజులలో దేశ రాజకీయ దిశను ప్రభావితం చేసే అంశంగా మారింది.

This post was last modified on August 20, 2025 9:38 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

6 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

7 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

7 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

7 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

8 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

8 hours ago