మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి.. ఉరఫ్ బీటెక్ రవి. టీడీపీలో ఇప్పుడు ఈ పేరు హాట్ హాట్. ఏ బాధ్యత అప్పగించినా.. ఆయన నెగ్గుకు రావడమే ప్రస్తుతం ఈ పేరును చర్చకు వచ్చేలా చేసింది. 2017-18 మధ్య, తర్వాత .. ఇప్పుడు కూడా.. బీటెక్ రవికి పార్టీ అధినేత చంద్రబాబు అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా విజయం దక్కించుకునేలా ఆయన వ్యవహరించారు. అప్పట్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి వివేకానందరెడ్డిని ఓడించే విషయంలో బీటెక్ రవి వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
అప్పట్లో ఈ గెలుపు టీడీపీని నెక్ట్స్ లెవిల్‌కు తీసుకు వెళ్లింది. ఆ తర్వాత.. మరోసారి ఇప్పుడు జరిగిన జడ్పీటీసీ ఉప పోరులో తన సతీమణికి అవకాశం దక్కేలా చేసుకోవడంతోపాటు.. పార్టీని విజయం వైపు నడిపించడంలోనూ బీటెక్ రవి వ్యవహరించిన తీరుకు సీఎం చంద్రబాబు నుంచి ప్రశంసలు దక్కాయి. ప్రధానంగా మూడు వ్యూహాలతో నాడు-నేడు.. బీటెక్ రవి ముందుకు సాగారు. అవే ఆయనకు విజయాలు దక్కేలా చేశాయని పార్టీ నాయకులు అంటారు. ఫలితంగా ఆయా ఎన్నికల్లో తిరుగులేని విధంగా టీడీపీ ముందుకు సాగింది.
1) అందరినీ కలుపుకొని పోవడం: కడప అంటేనే.. వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. ఇక, పులివెందుల అంటే .. చెప్పాల్సిన అవసరం లేదు. అలంటి చోట టీడీపీని విజయ తీరం వైపు నడిపించడం అంటే.. కత్తిమీద సాము చేయడమే. అందుకే.. రవి అందరినీ కలుపుకొని పోవడంతోపాటు.. నాయకులకు సరైన దిశానిర్దేశం చేయడంతోపాటు తనదైన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఫ్యాక్షన్ జిల్లాలో చుక్క రక్త నేల రాలకుండా.. రాజకీయ విజయం దక్కడం వెనుక సమష్టి కృషికి పెద్ద పీట వేశారు.
2) పార్టీ లైన్: పార్టీ లైన్ ప్రకారం నడుచుకుని.. ప్రజలను సమీకరించడం కూడా.. బీటెక్ రవి వ్యూహాల్లో కీలకం. ఆయన ఏదైనా అనుకున్నా.. పార్టీలైన్ ప్రకారమే అడుగులు వేశారు. అదేసమయంలో ప్రజలకు వివరించి చెప్పడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు.
3) విస్తృత పర్యటనలు: ఎన్నికలు వస్తేనే కాదు.. రాకపోయినా.. ప్రజల మధ్య ఉంటున్న నాయకుడిగా రవికి పేరుంది. ఇది ఆయనకు మరింతగా కలిసి వస్తోంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ.. ఇప్పుడు జడ్పీ ఎన్నికల్లోనూ ఇది కలిసి వచ్చింది. ఫలితంగా .. రవి విజయం వెనుక.. స్వీయ కృషి, వ్యూహం, పార్టీలైన్ వంటివి స్పష్టంగా కనిపిస్తుంటాయని పరిశీలకులు కూడా అంగీకరిస్తారు.
This post was last modified on August 15, 2025 10:53 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…