భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఎక్కడికక్కడ జనం జాతీయ జెండాలను ఎగురవేసి… ఆయా ప్రాంతాల్లో జరిగిన అధికార వేడుకలకు హాజరై తమ ఉత్సాహాన్ని చాటుకున్నారు. సరిగ్గా… భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తానని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే శుక్రవారం మధ్యాహ్నం స్త్రీ శక్తి పేరిట రూపొందించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు.
మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఉండవల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, స్థానిక ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మంత్రి నారా లోకేశ్ లు పాలుపంచుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో సంబరం అంబరాన్నంటింది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో కూటమి కట్టి బరిలోకి దిగిన టీడీపీ… తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పేరిట ఆయా వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ ప్రచారం కూటమికి ఓ రేంజిలో మైలేజీని తీసుకొచ్చింది. అప్పటిదాకా 151 సీట్లతో బలీయంగా ఉన్న వైసీపీని ఈ ప్రచారమే 11 సీట్లకు పరిమితం చేసింది. కూటమికి ఏకంగా 164 సీట్లను కట్టబెట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నా… కాస్తంత గ్యాప్ తీసుకున్న సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ లోని ఒక్కో పథకాన్ని అమలులోకి తీసుకుని వచ్చారు. తాజాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం రూపొందించిన స్త్రీ శక్తి పథకాన్ని కూడా ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఏపీ మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగానే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు.
ఆధార్ కార్డుల ఆధారంగా మహిళలకు ఆర్టీసీ అధికారులు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తారు. ప్రయాణం ఉచితమే అయినా మహిళలకు ఆర్డీసీ కండక్టర్లు టికెట్లు జారీ చేస్తారు. ఈ టికెట్లపై స్త్రీ శక్తి అనే పేరు ముద్రించి ఉంటుంది. ఇక స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ ప్రెస్ లలో మాత్రమే ఉచిత ప్రయాణం అమలు అవుతుంది. ఇతరత్రా బస్సుల్లో ఈ పథకం అమలు కాదు. ఇదిలా ఉంటే… స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్… ఉండవల్లి నుంచి విజయవాడ వరకు మహిళలతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా మహిళలతో వారి సమస్యలపై చంద్రబాబు ఆరా తీశారు. మరోవైపు ఆయా జిల్లాల్లో మంత్రులు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
This post was last modified on August 15, 2025 4:44 pm
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్‌కు…