లూజుగా వ్యవహరించే, ఇష్టానుసారంగా వ్యవహరించే నాయకులకు ఎక్కడికక్కడ నట్లు బిగించే కార్యక్ర మం రాష్ట్రంలో కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఆయన నిఘాను పెడుతూనే ఉన్నారు. తప్పులు చేస్తున్నవారిని హెచ్చరిస్తూ నే ఉన్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటూ.. వాటికి అనుగుణంగా నాయకుల ను మలుస్తున్నారు. తాజాగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
అయితే.. దీనిని కొందరు నాయకులు లైట్ తీసుకున్నారు. వాస్తవానికి చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టి నా.. దానికి కొన్ని విధి విధానాలు ఏర్పాటు చేస్తారు. అలానే.. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి కూడా 4 విధివిధానాలు ఏర్పాటు చేశారు. 1) ఇంటింటికీ నాయకులు వెళ్లాలి. 2) ఏడాది పాలనపై ఓరల్‌గా వారికి వివరించాలి. 3) ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని లిఖిత పూర్వకంగా కరపత్రాలు రూపొందించి ప్రజలకు అందించాలి. 4) ప్రజల సంతృప్తిని నమోదు చేయాలి.
ఈ నాలుగు చేసేందుకు నాయకులకు చంద్రబాబు పలు దఫాలుగా శిక్షణ కూడా ఇచ్చారు. అయితే.. కొందరు నాయకులు వీటిని పాటిస్తుండగా.. మరికొందరు విస్మరిస్తున్నారు. ఈ విషయాలపై దృష్టి పెట్టిన చంద్రబాబు.. ఐవీఆర్ ఎస్ సర్వేతో ఎమ్మెల్యేల తీరుపైనిఘా పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో నిరంతరాయంగా ఈ సర్వే చేస్తున్నారు. నేరుగా ప్రజలకు ఫోన్లు చేసి.. వారి అభిప్రాయా లు తెలుసుకుంటున్నారు. ఈ సర్వేలో ప్రధానంగా మూడు ప్రశ్నలు సంధిస్తున్నారు. వాటి ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తున్నారు.
1) మీ ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చారా? అనేది ఫస్ట్ ప్రశ్న, సుపరిపాలనలో భాగంగా ఇంటింటికీ తిరిగి.. ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని చంద్రబాబు చెప్పారు. కానీ, ఎక్కువ మంది నాలుగు రోడ్ల కూడళ్లలో నిలబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వెనుదిరుగుతున్నారు. 2) మీకు కరపత్రాలు ఇచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా చేసిన పనులకు సంబంధించి, ప్రజలకు జరిగిన లబ్ధిని వివరించేం దుకు కరపత్రాలు ఇవ్వడం ద్వారా.. ప్రజలకు చేరువ కావాలన్నది బాబు లక్ష్యం.
ఇది చాలా తక్కువ మంది చేస్తున్నారు. 3) ఎమ్మెల్యేల సంభాషణ ఎలా ఉంది. అంటే.. ప్రజలతో వారు పొడిపొడిగా మాట్లాడుతున్నారా? లేక.. మనసు పెట్టి పనిచేస్తున్నారా? అనేది తెలుసుకుంటున్నారు. ఇలా.. తొలి అడుగు కార్యక్రమంపై చంద్రబాబు తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. మరి నాయకులు దీనిని లైట్ తీసుకుంటే.. కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates