ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో వరసగా పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి, సోషల్ మీడియాలో హడావిడి చేసి దాని వైపు అటెన్షన్ వచ్చేలా చేసుకున్నారు. ముఖ్యంగా బిజినెస్ అంటూ రేపిన సస్పెన్స్ వర్కౌట్ అవుతుందనే నమ్మకం మూవీ లవర్స్ లోనూ కనిపించింది.
టైటిల్ మారిన నవాబ్ కేఫ్ కూడా వీలైనంత పబ్లిసిటీ చేసుకునేందుకు కష్టపడింది. తమిళ డబ్బింగ్ బూకీకి ఎలాంటి సౌండ్ లేదు కానీ విజయ్ ఆంటోనీ ప్రొడక్షన్ కార్డు వసూళ్లు తెస్తుందేమోనని బయ్యర్లు ఆశపడ్డారు. ఇవి కాకుండా మరో రెండు మూడు చిన్న చిత్రాలు వచ్చాయి
ఇప్పుడు టాపిక్ వీటిలో కంటెంట్ ఎలా ఉందనేది కాదు కానీ ఇన్ని రిలీజులు ఉన్నా థియేటర్ల దగ్గర ఆశించిన సందడి లేదు. హైదరాబాద్ లో కొంత మేరకు ఒకే కానీ చాలా బిసి సెంటర్లలో డబుల్ డిజిట్ ఆక్యుపెన్సీల కోసం సింగిల్ స్క్రీన్ ఓనర్లు కిందా మీదా పడాల్సి వచ్చింది.
ఆన్ లైన్ టికెట్లు కొనకపోయినా కనీసం కరెంట్ బుకింగ్ దగ్గరైనా ఊపందుకోవాలి. కానీ ఆ దాఖలాలు పెద్దగా కనిపించలేదు. మౌత్ టాక్, రివ్యూలు పూర్తిగా వచ్చాక నిర్ణయించుకుందాంలే అని ఆడియన్స్ అనుకోవడం వల్లే ఇలాంటి వాతావరణం ఉందనుకోవాలి. గత వారం ఫంకీ డిజాస్టర్, కపుల్ ఫ్రెండ్లీ స్లో రన్ లాంటి అనుకూలతలు ఇవి వాడుకోలేకపోయాయి.
ఈ వీకెండ్ రెండు రోజులు అన్ని సినిమాలకు చాలా కీలకం కానుంది. వీలైనంత వసూళ్లు రాబట్టుకోవాలి. మళ్ళీ సోమవారం నుంచి డ్రాప్ ఎలాగూ ఉంటుంది కాబట్టి కలెక్షన్ కసరత్తు కోసం ఆయా యూనిట్లు పబ్లిసిటీ స్పీడ్ పెంచబోతున్నాయి. తాప్సి నటించిన హిందీ మూవీ ఎక్కిస్ కు రిపోర్ట్స్ బాగానే వినిపిస్తున్నా ఏపీ తెలంగాణలో దానికీ జనం కనిపించడం లేదు.
చూస్తుంటే వాళ్లంతా సంక్రాంతి మూడ్ నుంచి బయటికి వచ్చినా తిరిగి సినిమాల ప్రేమలో పడినట్టు లేరు. మరి హే బలవంత్ లాంటివి బలవంతం లేకుండా స్వచ్చందంగా ఏ మేరకు పబ్లిక్ ని వారాంతం థియేటర్ల వైపు ఎలా ఆకర్షిస్తాయనేది వేచి చూడాలి. ముందైతే అనూహ్యమైన పికప్స్ ఉండాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates