సింగ‌పూర్‌ను సైతం బెదిరించిన వైసీపీ: చంద్ర‌బాబు

వైసీపీ నేత‌ల‌పై సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అమ‌రావతి రూప‌క‌ల్ప‌నలో కీల‌క పాత్ర పోషించిన సింగ‌పూర్‌ను సైతం వైసీపీ నాయ‌కులు బెదిరించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. వైసీపీ ప్ర‌భుత్వం అమ‌రావతిని ప‌క్క‌న పెట్ట‌డం.. అరాచ‌కాలు సృష్టించ‌డంతో సింగ‌పూర్ ప్ర‌భుత్వం భ‌య ప‌డిన‌ట్టు సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు. అంతేకాకుండా.. వైసీపీ మంత్రులు కొంద‌రు సింగ‌పూర్‌కు వెళ్లి.. అక్క‌డి వారిని బెదిరింపుల‌కు గురిచేశార‌ని అన్నారు. దీంతో సింగ‌పూర్‌కుచెందిన కంపెనీలు, పెట్టుబ‌డులు కూడా వెన క్కి వెళ్లిపోయాయ‌ని చెప్పారు.

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. సింగ‌పూర్ ప్ర‌తినిధుల‌తో మాట్లాడి.. వారిని ఒప్పించి.. తిరిగి పెట్టు బ‌డులు పెట్టేలా చేసేందుకు నానా తిప్ప‌లు ప‌డాల్సి వ‌చ్చింద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. గ‌త నెల 26 నుంచి చంద్ర‌బాబు నాలుగు రోజుల పాటు సింగ‌పూర్‌లో ప‌ర్య‌టించారు. ఈక్ర‌మంలో ఆయ‌న సింగ‌పూర్ మంత్రులు స‌హా.. పెట్టుబ‌డి దారుల‌తో కూడా భేటీ అయ్యారు. అయితే.. చంద్ర‌బాబు సింగ‌పూర్ నుంచి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆయా వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు.

తాజాగా కేబినెట్ సమావేశంలో సీఎం చంద్ర‌బాబు త‌న సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న విశేషాల‌ను మంత్రుల‌కు వివ‌రించారు. వైసీపీ హ‌యాంలో సింగ‌పూర్ ప్ర‌తినిధుల‌ను, మంత్రుల‌ను కూడా భ‌య పెట్టార‌ని అన్నారు. దీంతో ఏపీపై సింగ‌పూర్‌కు న‌మ్మ‌కం పూర్తిగా పోయింద‌న్నారు. తిరిగి ఆ న‌మ్మ‌కాన్ని పున‌రుద్ధ రించేందుకు ఎంతో శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఈ ఏడాది నిర్వ‌హించే పెట్టుబ‌డుల స‌ద‌స్సుకు రావాల‌ని పిలిచినా.. సింగ‌పూర్ ప్ర‌తినిధులు, మంత్రులు తొలుత ఒప్పుకోలేద‌ని తెలిపారు. దీనికి గ‌ల కార‌ణాల‌ను ఆరా తీసిన‌ట్టు సీఎం చెప్పారు.

వైసీపీ హ‌యాంలో ప‌లువురు మంత్రులు సింగ‌పూర్‌కు వెళ్లి అక్క‌డి మంత్రుల‌ను బెదిరించిన విష‌యం వె లుగు చూసింద‌న్నారు. అందుకే వారు ఏపీకి వ‌చ్చేందుకు కూడా విముఖత వ్య‌క్తం చేశార‌ని అన్నారు. వారి ని బుజ్జ‌గించి.. ఏపీకి ర‌ప్పించే విష‌యంలో ఒప్పించేందుకు నానా ప్ర‌యాస ప‌డిన‌ట్టు వివ‌రించారు. త్వ‌ర లోనే సింగ‌పూర్ నుంచి భారీ పెట్టుబ‌డులు రానున్నాయ‌ని తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న చూసి.. సింగ‌పూర్ పెట్టుబ‌డి దారులు వ‌స్తున్నార‌ని వివ‌రించారు.