ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019, మార్చి లో సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో సీబీఐ.. విచారణ పూర్తయిందని.. ఇక, తాము వ్యక్తిగతంగా చేయాల్సిన విచారణ అంటూ.. లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ మేరకు సుప్రీంకోర్టు లో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఇదేసమయంలో “మీరు మరోసారి విచారణ చేయమంటే“ అం టూ.. ధర్మ సందేహాన్ని కోర్టుకు వదిలేసింది. మరి సీబీఐ ఈ కేసులో విచారణ పూర్తి చేసేసినట్టేనా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఈ కోణంలో చూసుకుంటే.. వివేకా కుమార్తె, డాక్టర్ నర్రెడ్డి సునీత చెబుతున్న ప్రకారం.. ఈ కేసులో `సూత్ర ధారి` ఎవరు? అన్నది మాత్రం సీబీఐ ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఒకవేళ సూత్రధారి, పాత్ర ధారి కూడా.. ఒక్కరే అని భావిస్తే.. సదరు నిందితుడికి ముందస్తు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా బలమైన వాద నలు వినిపించలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి కూడా సీబీఐ నుంచి ఎలాంటి సమాధానం లేదు. అంతేకాదు.. ఈ కేసు విచారణ పూర్తయిందని సీబీఐ చెబుతున్ననేపథ్యంలో ఆ సంస్థ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు కూడా చాలానే ఉన్నాయని.. వివేకా బంధువులు(జగన్‌తో విభేదించేవారు) చెబుతున్నారు.
ప్రధానంగా.. సూత్రధారి ఎవరు? ఎందుకు హత్య చేయించారు? ఈ రెండు అంశాలను సీబీఐ ఇప్పటి వరకు.. బయట పెట్టలేదు. అంతేకాదు.. ఈ కేసులో చార్జిషీట్లు దాఖలు పూర్తయ్యాయా? అనేది కూడా సందేహంగానే ఉంచేసింది. ఒకవేళ చార్జిషీట్లు పూర్తయితే.. తెలంగాణ కోర్టులో విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదు? అనేది ప్రశ్న. దీనికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. మరీ ముఖ్యంగా వివేకా దారుణ హత్యను గుండెపోటుగా అభివర్ణించింది ఎవరు? దీనికి రీజనేంటి? అనే విషయాలను కూడా సీబీఐ చెప్పాల్సి ఉంది.
ప్రధానంగా.. వివేకా ఆస్తుల వివాదంతోనే హత్యకు గురయ్యారన్న ప్రత్యర్థుల ఆరోపణలపై సీబీఐ ఎందు కు మౌనంగా ఉందన్నది కూడా ప్రశ్నే. రేపు న్యాయస్థానం ముందు.. ఈ కేసు విచారణకు వస్తే.. బాధిత పక్షం చేసే వాదనలకంటే కూడా.. ప్రత్యర్థి పక్షం, ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు.. చేసే వాదనలకు ప్రాధాన్యం ఏర్పడేలా మొత్తం వ్యవహారం ఉందన్న సునీత తరఫు న్యాయవాదుల వాదనలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నది కూడా.. ముఖ్యం.
మరి విచారణ పూర్తయితే.. సీబీఐ డీఎసపీ రామ్ సింగ్ కేసు సంగతేంటి? అనేది కూడా కీలకం. ఎలా చూసుకున్నా.. అప్రూవర్ దస్తగిరి నుంచి అనేక మంది ఇచ్చిన వాంగ్మూలాలపై విచారణ జరగాల్సి ఉందన్నవాదనలు వినిపిస్తున్న సమయంలో విచారణ పూర్తయితే.. పై ప్రశ్నలకు సీబీఐ సమాధానం చెప్పాల్సి ఉంటుందని సునీత తరఫున న్యాయవాదులు చెబుతున్నారు.
This post was last modified on August 6, 2025 1:59 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…