ఇద్దరూ బీఆర్ ఎస్ గూటి పక్షులే. కానీ.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుని.. పార్టీనిబజారున పడేస్తున్నార న్న కామెంట్లు వినిపిస్తున్నాయి. లిల్లీ ఫుట్ అంటూ… జగదీష్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు.. తీవ్ర సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఆమె ఏమన్నా.. కూడా ఎవరూ మాట్లాడకపోయినా.. అంతర్గతంగా మాత్రం కవిత వ్యవహార శైలిపై చర్చిస్తున్నారు. ఆమెను పార్టీ నుంచి తీసేయలేని పరిస్థితి.. చర్యలు తీసుకునే పరిస్థితి కూడా లేదన్నది నాయకులు చెబుతున్న మాట.
ఇక, కవిత గురించి మాట్లాడడం వేస్ట్.. అంటూ జగదీష్ రెడ్డి కూడా భారీ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు.. తాను కనీసం.. కుంటో.. నడిచో.. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నానని.. కానీ.. ప్రజలు ఛీకొట్టిన నాయకురాలు తనపై కామెంట్లు చేయడం ఏంటో? అని పెదవి విరిచారు. ఎవరైనా కేసీఆర్ వల్లే ఎలివేట్ అయ్యామన్న జగదీష్.. కేసీఆర్ అనే మూడు అక్షరాలను పక్కన పెట్టి.. ప్రజల్లోకి వస్తే.. ఎవరి విలువ ఎలా ఉంటుందో అందరికీ అప్పుడు అర్ధమవుతుందన్నారు.
తాను బీఆర్ ఎస్‌కు.. కేసీఆర్ కు కూడా.. వీరవిధేయుడినని చెప్పుకొచ్చారు. కానీ, కొందరు తప్పులు చేసి పార్టీని రోడ్డున పడేస్తున్నారని పరోక్షంగా మద్యం కుంభకోణం కేసు గురించి ఆయన చెప్పుకొచ్చారు. అయి తే.. కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన నేరుగా స్పందించకపోయినా.. పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఈ పరిణామాలు.. రాజకీయంగా పార్టీని రోడ్డున పడేస్తున్నాయి. ఇటీవల తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు.. తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో తనకు ఎవరూ అండగా నిలవలేదని కవిత ఆవేశంతో ఉన్న విషయం తెలిసిందే.
కానీ, డియర్ డాడీ పేరుతో హద్దులు మీరారని.. కవితపై పార్టీ అధినేత గుర్రుగా ఉన్నారు. అంతేకాదు.. ఆమెకు కనీసం దర్శనం కూడా కల్పించడం లేదు. ఈ విషయాన్ని కూడా జగదీష్ రెడ్డి ప్రస్తావిస్తూ.. తాను ఇప్పటి వరకు 50 సార్లు కలుసుకున్నానని.. కానీ, ఒకరు కేసీఆర్‌ను చూసేందుకు వచ్చినా గేటు దాటి లోప లికి వెళ్లలేక పోతున్నారని వ్యాఖ్యానించారు. ఇక, మరికొందరు మాత్రం కేసీఆర్ బిడ్డ కాబట్టి ఏమీ అనలేక పోతున్నామని అన్నారు. అంటే.. దీనిని బట్టి కవిత విషయాన్ని నాయకులు ఎంత సీరియస్‌గా తీసుకున్నారన్న విషయం తెలుస్తూనే ఉంది. మరి ఈ రాజకీయాలు.. ఎటు దారి తీస్తాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates