ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్ల కాలంలో లిక్కర్ ఆ పార్టీ నాయకులకు ఒక ఆదాయ వనరు!. ఈ మాట చెప్పింది… ప్రత్యర్థులు కాదు.. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు. అందుకే.. ఈ కేసులో ఇప్పటికి 44 మందిని విచారించారు. వీరిలోనూ కీలకమైన మాజీ ఐఏఎస్ అదికారులు కూడా ఉన్నారు. అలానే.. వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. సో.. మొత్తంగా రాజ్ కసిరెడ్డితో మొదలైన ఈ వ్యవహారం.. ఇప్పుడు కీలక మలుపు తిరిగింది.
ప్రస్తుత ఎంపీ.. వైసీపీ కీలక నాయకుడు.. మిథున్ రెడ్డి వరకు వచ్చింది. ఆయనను రేపో మాపో అరెస్టు చేయడం ఖాయం. అయితే.. అసలు ఈ లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి ఏం చేశారు? అంతగా ఆయనను ఈ కేసులో ఏ-4గా నమోదు చేయాల్సిన అవసరం ఏముంది? అనేవి కీలక ప్రశ్నలు. వీటిపైనా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు.. పలు విషయాలను వివరించారు.
1) వైసీపీ హయాంలో చీపు లిక్కరును అత్యధిక మొత్తంలో అంటే.. రూ.50 విలువ చేసే బ్రాండ్లను రూ.200(క్వార్టర్)కు విక్రయించేలా ధర నిర్ణయించింది.. మిథున్ రెడ్డే.
2) తమ సొంత కంపెనీలను ఏర్పాటు చేసి.. ఈ డిస్టలరీల ద్వారా మద్యాన్ని ప్రభుత్వానికి విక్రయించారు. ఈ క్రమంలో సుమారు 15 కోట్లను తమ ఖాతాలోకి మళ్లించుకున్నారు.
3) సిట్ కేసు నమోదు చేయడానికి ముందే.. ఏ కంపెనీల ద్వారా తమకు సొమ్ము అందిందో .. ఆయా కంపెనీలకు ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారు. ఈ విషయాన్ని కూడా సిట్ అధికారులు గుర్తించారు.
4) ఎంపీగా తనకు ఉన్న అధికారాలను అడ్డం పెట్టుకుని.. జిల్లాల్లో.. అధికార యంత్రాంగాన్ని నడిపించారు. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలోనూ.. మిథున్ రెడ్డి పాత్ర ఉంది.
5) డిస్టిలరీలకు(ఇతర కంపెనీలు) ఇండెంటు పెట్టే విషయం కూడా.. మిథున్ రెడ్డే చూసుకున్నారు. తద్వారా.. తమకు అధిక మొత్తంలో కమీషన్లు ఇచ్చే కంపెనీలకు ఎక్కువ మొత్తంలో ఇండెంటు దక్కేలా చక్రం తిప్పారు.
6) వచ్చిన కమీషన్లు ఎవరికి ఎంత మొత్తం చెల్లించాలో.. హైదరాబాద్, రాజంపేటలోని నివాసం, దుబాయ్‌లలో చర్చించి నిర్ణయించిన గ్రూపులో మిథున్ రెడ్డి ఒకరు. ఇలా.. పలు అంశాలను సిట్ అధికారులు పేర్కొన్నారు.
This post was last modified on July 18, 2025 3:02 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…