వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు 41 మందిని ప్రత్యేకదర్యాప్తు బృందం(సిట్) విచారించింది. కొందరిని అరెస్టు కూడా చేసింది. ప్రస్తుతం వారంతా జైల్లో ఉన్నారు. ఇదే కేసులో ‘మాస్టర్ మైండ్’గా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని కూడా సిట్ అధికారులు రెండు సార్లు విచారించారు. అయితే.. తనను అరెస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్న ఆయన.. గతంలో సుప్రీం కోర్టుకు వెళ్లారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే… హైకోర్టులోనే ఈ విషయం తేల్చుకోవాలని.. సాధ్యమైనంత వేగంగా కేసును విచారణ చేపట్టాలని అప్పట్లో సుప్రీంకోర్టు ఆదేశించింది.
దీంతో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. పలు దఫాలుగా వాదనలు వింది. తాజాగా మంగళవారం సాయంత్రం తీర్పు వెలువరించింది. మద్యం కేసులో ముడుపులను దారిమళ్లించడంలో మిథున్ రెడ్డిని ‘మాస్టర్ మైండ్’గా పేర్కొన్న సిట్ తరఫున వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంటూ.. సదరు పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఎంపీ మిథున్‌రెడ్డిని ఎప్పుడైనా అరెస్టు చేసేందుకు అవకాశం ఉంది. కాగా.. ఈ వాదనల సందర్భంగా.. మిథున్ రెడ్డి వ్యూహం ప్రకారమే డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకున్నారని.. ఎవరెవరి నుంచి ఎంత మొత్తం తీసుకోవాలన్న దానిని కూడా నిర్ణయించారని సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు.
అంతేకాదు.. ఇప్పటికే కీలకమైన 8 కేసుల్లో మిథున్ రెడ్డి నిందితుడిగా ఉన్నారని కూడా కోర్టుకు వివరించారు. నేర పూరితకుట్రకు పాల్పడ్డారని.. ఆయనకు బెయిల్ ఇవ్వరాదని.. ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కూడా వాదనలు వినిపించారు. ముడుపులు ఎవరెవరి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? ఆ ముడుపులను ఏ విధంగా దారి మళ్లించారన్న విషయాలపై అధికారులు విచారణ చేస్తున్నారని న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఇలాంటి సమయంలో మిథున్‌రెడ్డికి బెయిల్ ఇస్తే.. అది విచారణ ప్రక్రియపై ప్రభావం చూపుతుందని తెలిపారు.
ఈ క్రమంలో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దన్నారు. దీంతో అప్పట్లో తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు.. తాజాగా తీర్పును వెలువరించింది. ముడుపుల వ్యవహారంలో మాస్టర్ మైండ్‌గా వ్యవహరించారన్న వాదనలతో ఏకీభవిస్తున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు గడువు ఇవ్వాలన్న అభ్యర్థనను మాత్రం పరిశీలనలోకి తీసుకుంది.
This post was last modified on July 16, 2025 10:17 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…