ఇటీవల దశాబ్ద కాలంలో ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరంలో ఒక్కసారిగా అలజడి రేగింది. మార్నింగ్ వాక్ కు వచ్చిన కమ్యూనిస్టు నాయకుడే లక్ష్యంగా కొందరు దుండగులు.. తుపాకీలతో కాల్పులు జరిపారు. దీంతో హైదరాబాద్ నగరం యావత్తు పొద్దు పొద్దున్నే ఉలిక్కి పడింది. అసలేం జరిగిందంటూ.. అందరూ ఆరా తీశారు. వాస్తవానికి తెలంగాణలో తుపాకీ సంస్కృతి లేదు. తుపాకులు ఉన్న నాయకులు ఉన్నా.. ఎప్పుడూ వాటిని బయటకు కూడా తీసినట్టు ఎక్కడా కనిపించలేదు.
కానీ.. తాజాగా మంగళవారం ఉదయం మలక్ పేటలో చోటు చేసుకున్న ఘటన యావత్ హైదరాబాదీలను ఉలికిపాటుకు గురి చేసింది. మలక్‌పేటలోని శాలివాహన నగర్ పార్క్‌లో జరిగిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మార్నింగ్ వాక్ కోసం.. వెళ్లిన సీపీఐ రాష్ట్ర నేత చందు నాయక్(43)పై గుర్తు తెలియని దండు గులు తుపాకీతో కాల్పులు జరిపారు. కారులో ఒక్క ఉదుటన దూసుకు వచ్చిన దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే.. ఈ కాల్పుల ఘటనలో చందు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు భార్య, కుమార్తె కూడా ఉన్నారు. వారు కూడా ఈ ఘటన సమయంలో మార్నింగ్ వాక్‌లోనే ఉన్నారు. అయితే.. వారు కూడా భయంతో అక్కడ నుంచి పరారయ్యారు. ఘటన జరిగిన కొద్ది సేపటికే పోలీసులు రంగంలోకి దిగి.. ఆధారాలు సేకరించారు. మరోవైపు.. పోస్టుమార్టమ్ కోసం.. మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ఏంటి కారణం?
కాల్పుల ఘటనపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. భూములు, పొలాల విషయంపై పంచాయతీలు చేసిన నేపథ్యంలోనే ప్రత్యర్థి పక్షం చందుపై కక్ష పెంచుకుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనపై కాల్పులు జరిగాయని అంటున్నారు. మరోవైపు.. వివాహేతర సంబంధం కూడా కారణమనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదిలావుంటే.. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం నర్సాయిపల్లికి చెందిన చందు.. సీపీఐలో 20 ఏళ్లుగా ఉన్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి నాయకుడిగా ఎదిగారు.
This post was last modified on July 15, 2025 3:24 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…