2019-24 మధ్య వైభవం చూసి.. గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం చవిచూశాక బాగా అన్ పాపులర్ అయిన నేతల్లో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. ఆయన వ్యక్తిగత వ్యవహారాలు తీవ్ర దుమారం రేపడంతో, పార్టీ నుంచి సస్పెండై రాజకీయాలకు దూరమయ్యే పరిస్థితిని కొనితెచ్చుకున్నారు దువ్వాడ. అధికారంలో ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆయన ఏ స్థాయిలో నోరు పారేసుకున్నారో తెలిసిందే. అలాంటి వ్యక్తి తనకు ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన సాయం గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించారు.
ఒకప్పుడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో దువ్వాడ శ్రీనివాస్ కూడా సభ్యుడే. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగానూ పోటీ చేశారాయన. కానీ ఓటమి పాలయ్యారు. ఐతే ఎన్నికల్లో ఓడి ఆర్థికంగా నష్టపోయానన్న ఉద్దేశంతో చిరు తనకు సాయం చేసిన విషయాన్ని శ్రీనివాస్ వెల్లడించాడు. ఎన్నికలు అయ్యాక చిరు స్వయంగా ఫోన్ చేసి.. ‘‘ఎన్నికల్లో ఓడిపోయావు కదా, డబ్బులు నష్టపోయి ఉంటావు, మనందరం రాజశేఖర్ రెడ్డి హవాలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. డబ్బుల విషయంలో ఇబ్బంది పడుతుంటావు. ఈ సాయం తీసుకో’’ అని అడిగి మరీ డబ్బులు పంపించినట్లు దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు.
ఏమనుకున్నారూ చిరంజీవి అంటే అంటూ మెగాస్టార్‌కు ఆయన ఎలివేషన్ ఇచ్చారు. తనకు చిరు డబ్బులు ఇచ్చిన విషయం అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలో ఉన్న గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు లాంటి వాళ్లకు కూడా తెలుసని ఆయనన్నారు. ఐతే చిరు నుంచి ఇంత సాయం పొందిన దువ్వాడ.. తర్వాతి రోజుల్లో ఆయన సోదరుడైన పవన్ కళ్యాణ్ మీద ఆ స్థాయిలో ఎలా నోరు పారేసుకున్నారు, ఎలా దూషణలకు దిగారు అంటూ నెటిజన్లు ఈ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు.
This post was last modified on July 10, 2025 1:29 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…