Political News

ప్లాన్ ప్ర‌కార‌మే అల‌జ‌డి.. వారంతా వైసీపీ రైతులే!

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ప‌ర్య‌టించిన జ‌గ‌న్‌.. ప‌క్కా ప్లాన్‌తో వ్య‌వ‌హ‌రించార‌ని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లాకే చెందిన వైసీపీ మాజీ స‌ర్పంచ్ ప్ర‌కాష్ రెడ్డికి 25 ఎక‌రాల మామిడి తోట ఉంద‌ని.. ఆయ‌న గ‌తంలోనే చాలా వ‌ర‌కు కాయ‌ల‌ను కిలో 4 రూపాయ‌ల చొప్పున అమ్మేసుకున్నార‌ని చెప్పారు. అయితే.. జ‌గ‌న్ వస్తున్నాడ‌ని తెలిసి.. ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం ఐదు ట్రాక్ట‌ర్ల‌లో మామిడికాయ‌ల‌ను త‌ర‌లించి.. న‌డిరోడ్డుపై పోసి.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కుట్ర‌లు ప‌న్నార‌ని తెలిపారు. రైతుల‌ను ప‌రామ‌ర్శించాల‌న్న ఉద్దేశం ఉంటే.. రెండు మాసాల కింద‌టే జ‌గ‌న్ వ‌చ్చి ఉండాల్సింద‌న్నారు.

కాని.. ఇప్పుడు కొనుగోలు ప్ర‌క్రియ దాదాపు ముగిసిపోతున్న ద‌శ‌లో వ‌చ్చి.. రాజ‌కీయం చేయాల‌ని.. కుట్ర‌లు ప‌న్నార‌ని మంత్రి చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌కాష్‌రెడ్డి తోట నుంచి అప్ప‌టిక‌ప్పుడు ట్రాక్ట‌ర్ల‌లో మామిడి కాయ‌లు త‌ర‌లించి.. ర‌హ‌దారికి అడ్డంగా నిలిపి.. ట్రాఫిక్ నిలిపివేసి.. ట్రాక్ట‌ర్ల‌లోని మామిడి కాయ‌ల‌ను ర‌హ‌దారుల‌పై వెద‌జ‌ల్లార‌ని చెప్పారు. పోనీ.. ఆయ‌న‌కు బాధ‌తో అలా చేశార‌ని అనుకున్నా.. జ‌గ‌న్ ఐదేళ్లు ముఖ్య‌మంత్రిగా పాలించిన అనుభ‌వం ఏమైంది? అని అచ్చెన్న ప్ర‌శ్నించారు. వెంట‌నే కారు దిగి.. ప్ర‌కాష్‌రెడ్డిని వారించాల్సిన అవ‌స‌రం లేదా? మామిడికాయ‌ల‌ను తొక్కుకుంటూ వెళ్లిపోతారా? అని నిల‌దీశారు.

వాస్త‌వానికి జ‌గ‌న్ వ‌చ్చే హెలిప్యాడ్‌ వద్దకు 30 మందికి అనుమతి మాత్ర‌మే ఉంద‌న్న అచ్చ‌న్నాయుడు 300 మంది వచ్చార‌ని చెప్పారు. సీఎంగా పని చేసిన వ్యక్తి ఈ సమాజానికి ఎలాంటి మెసేజ్‌ ఇస్తున్నారని ఆయ‌న నిల‌దీశారు. ఆ త‌ర్వాత ర్యాలీ వ‌ద్ద‌న్నా.. వేల మందిని పోగేసి.. ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసే ప్ర‌య‌త్నం చేశారన్నారు. ముందు వేసుకున్న ప్లాన్‌ ప్రకారమే ర్యాలీలు చేశార‌ని చెప్పారు. ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా లేక‌పోతే.. ఈ రోజు మ‌రింత మంది సింగ‌య్య‌లు చ‌నిపోయి ఉండేవార‌ని చెప్పారు. ఎంత జాగ్ర‌త్తలు పాటించినా.. పోలీసులు, విలేకరులపైనా దాడులకు తెగబ‌డ్డార‌ని.. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకుంటామా? అని ప్ర‌శ్నించారు.

This post was last modified on July 9, 2025 10:11 pm

Share

Recent Posts

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

51 minutes ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

1 hour ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

4 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

6 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

6 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

7 hours ago