దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్‌తో సంబంధం ఉన్న వారికి బీజేపీ అధ్యక్ష పీఠాలను అప్పగిస్తోంది. ఇది చిత్రం కాదు.. చాలా వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులుగా విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ ఇప్పటి వరకు ఉత్తరాది పైనే దృష్టి పెట్టింది. ఉత్తరాది రాష్ట్రాల ఓటు బ్యాంకు, అక్కడి ప్రజలను మచ్చిక చేసుకునే విషయంపైనే దృష్టి సారించింది. అలాంటి ఒక్కసారిగా దక్షిణాదిపై మక్కువ చూపిస్తోంది.
దీనికి కారణం.. ఉత్తరాదిలో కాంగ్రెస్ బలోపేతం అవుతోంది. దీనికితోడు.. చిన్న చితకా పార్టీలు.. కూడా ఉత్తరాదిలో బలం పుంజుకుంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ సహా.. సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ వంటివి బీజేపీకి సవాల్ రువ్వుతున్నారు. వీటితో పోల్చుకుంటే.. దక్షిణాదిలో పార్టీల దూకుడు బీజేపీకి పెద్దగా మైనస్ కాదు. పైగా.. ఎక్కువ పార్టీలు.. బీజేపీ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో కలిసి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ 2029 ఎన్నికలను దృస్టిలో పెట్టుకుని దక్షిణాదికి ప్రాధాన్యం పెంచుతోంది.
అంతేకాదు.. బీజేపీకి కలిసి వచ్చే అవకాశం కూడా దక్షిణాదిలో ఉంది. ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు ఇస్తున్న నిధులు.. ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులు వంటివి కమల నాథులకు కొంత ఊపిరి సలుపుకునే అవకాశం కల్పిస్తున్నాయి. తెలంగాణలో అయినా.. ఏపీలో అయినా.. తమిళనాడు, కర్ణాటకల్లో అయినా.. బీజేపీకి మేలు జరిగే అవకాశం కనిపిస్తోందన్నది ప్రత్యక్షంగానే కనిపిస్తోంది. అందుకే.. ఇక్కడి వారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు బీజేపీ ఉత్సాహంగా ఉంది.
ఉదాహరణకు గత ఎన్నికలను తీసుకుంటే.. బీజేపీకి దక్షిణాది పార్టీలైన టీడీపీ, జనసేనలు అండగా నిలిచాయి. ఫలితంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగింది. ఇదే ఫార్ములను వచ్చే ఎన్నికల నాటికి కూడా పాటించడం ద్వారా.. బీజేపీ పుంజుకునే దిశగా ముఖ్యంగా అధికారం నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచి దక్షిణాదిపైనే
ఆపరేషన్ లోటస్‌కు ఇదీ కారణమని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on July 7, 2025 10:37 am
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…