Political News

వైసీపీలో చాలా షేడ్సే ఉన్నాయే!

ఆలు లేదు.. చూలు లేదు..అన్న‌ట్టుగా ఉంది వైసీపీ నాయ‌కుల వ్య‌వ‌హారం. తాము అధికారంలోకి వ‌స్తే.. అన్న మాట నుంచి వ‌చ్చేస్తే వ‌ర‌కు నాయ‌కులు రెచ్చిపోతున్నారు. ఎన్నిక‌లు ముగిసి ఏడాది మాత్ర‌మే గ‌డిచింద‌ని.. మ‌రోసారి ఎన్నిక‌లు జ‌రిగేందుకు నాలుగేళ్ల స‌మ‌యం ఉంద‌న్న విష‌యాన్ని వారు మ‌రిచిపోయారో.. లేక న‌టిస్తున్నారో.. తెలియదు కానీ.. వైసీపీ నేత‌లు వేస్తున్న వేషాలు.. నెటిజ‌న్ల‌కు మంట‌పుట్టిస్తున్నాయి. దీంతో ‘వార్నీ యేషాలో.. వైసీపీలో చాలా షేడ్సే ఉన్నాయే!’ అని కామెంట్లు చేస్తున్నారు. పార్టీ అధినేత నుంచి నాయ‌కుల వ‌ర‌కు చేస్తున్న కామెంట్ల‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

కొన్నాళ్ల కింద‌ట నుంచి వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. మ‌ళ్లీ మన‌మే అధికారంలోకి వ‌స్తున్నాం. సినిమా చూపిస్తాం.. అని కామెంట్లు చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌, పోలీసుల‌పైనా ఆయ‌న దూకుడుగానే వ్యాఖ్యాలు చేశారు. స‌ప్త స‌ముద్రాల ఆవ‌ల ఉన్నా.. వ‌దిలి పెట్టేంది లేద‌న్నారు. బ‌ట్ట‌లూడ‌దీయిస్తామ‌ని కూడా వ్యాఖ్య‌లు చేశారు. వీటిపై పోలీసులు కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అయినా.. అధినేత త‌గ్గ‌లేదు. ఇక‌, అధినేత బాట‌లోనే నాయ‌కులు కూడా న‌డుస్తున్నారు. తాము అధికారంలోకి వ‌స్తే.. అంటూ.. కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు.

తాజాగా జ‌గ‌న్ మేన‌మామ‌, క‌డ‌ప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి మ‌రింత దూకుడుగా స్పందించారు. తాము అధికారంలోకి వ‌స్తూనే.. టీడీపీ నాయకులు, కార్య‌క‌ర్త‌ల ప‌నిప‌డ‌తాం అని సెల‌విచ్చారు. అంతేకాదు.. మ‌రో అడుగు ముందుకు వేసి.. టీడీపీ సానుభూతిప‌రుల‌కు ప‌థ‌కాల‌ను క‌ట్ చేసేస్తామ‌ని చెప్పారు. కేవ‌లం వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు మాత్ర‌మే సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌ని.. ఈ విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాల‌ని కూడా ఆయ‌న నొక్కి చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గ స్థాయి స‌మావేశంలో ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.

అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తున్న నెటిజ‌న్లు.. అస‌లు మీరు అధికారంలోకి వ‌చ్చేదెప్పుడు? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల స‌మ‌యం ఉంద‌ని.. ఇప్పుడే ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారా? అని ప్ర‌శ్నించారు. ఇప్పటి నుంచే ఊహ‌ల్లో విహ రిస్తున్నారా? అని మ‌రికొంద‌రు ప్ర‌శ్నించారు. క‌ల‌లు క‌న‌డం మంచిదే కానీ.. మ‌రీ ఇంతగా కాద‌ని.. మ‌రికొంద‌రు వ్యాఖ్యానించారు. ఇంకొంద‌రు దురుసుగా ‘వార్నీ యేషాలో.. వైసీపీలో చాలా షేడ్సే ఉన్నాయే!’ అని కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డం.. వారి నుంచి సానుభూతిని దూసుకోవ‌డం వంటివి వైసీపీకి తెలియ‌డం లేద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదీ.. సంగ‌తి!!.

This post was last modified on July 5, 2025 11:01 pm

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

1 hour ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

3 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

8 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

9 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

9 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

9 hours ago