భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జీరో నుంచి ఎదిగిన పార్టీ. దేశాన్నిఏళ్ల తరబడి పాలించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ను చిత్తు చేసి… ఇక కాంగ్రెస్ పార్టీకి అధికారం కలేనన్న భావనను కలిగిన పార్టీ. అయితే సుదీర్ఘ ప్రస్థానం కలిగిన బీజేపీకి ఇప్పటిదాకా అధ్యక్షుడు మాత్రమే కానసాగుతూ వస్తున్నారు గానీ ఇప్పటిదాకా మహిళా అధ్యక్షురాలు అన్న మాటే వినిపించలేదు. రాష్ట్రాల స్థాయిలో అధ్యక్షురాలు కనిపించినా టాప్ పోస్ట్ మాత్రం ఇప్పటిదాకా మహిళలకు దక్కలేదు. అయితే ఈ దఫా బీజేపీ టాప్ పోస్ట్ లేడీస్ కే నన్న మాట గట్టిగా వినిపిస్తోంది. అదే నిజమైతే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మహిళలకే ఈ టాప్ పోస్ట్ దక్కనుంది.
బీజేపీ అధ్యక్షురాలి రేసులో ముగ్గురు మహిళా నేతలు ఉన్నారు. వారిలో తొలి స్థానంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉండగా.. రెండో స్థానంలో ఏపీ బీజేపీ తాజా మాజీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఉన్నారు. ఇక మూడో ప్లేస్ లో బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వాసతీ శ్రీనివాసన్ ఉణ్నారు. వీనిలె తొలి ఇద్దరు ఏపీతో అనుబంధం ఉన్నావారు కాగా… తొలి, చివరి వారు తమిళనాడుకు చెందిన వారు. ఈ ముగ్గురిలోనూ పురంధేశ్వరికి ఎక్కువ అవకాశాలున్నట్లు విశ్లేషణలు సాగుతున్నాయి. ఏపీలో బీజేపీ, జనసే, టీడీపీ కూటమి పటిష్టంగా ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించిన తీరు పురందేశ్వరి సామర్థ్యానికి గీటురాయిలా బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.
నిర్మలా సీతారామన్ విషయానికి వస్తే… తమిళనాడుకు చెందిన ఈమె ఏపీ కోడలు. రాజకీయ విశ్లేషకుడిగా తెలుగు ప్రజలకు చిరపరచితులైన పరకాల ప్రభాకర్ ను వివాహమాడారు. బీజేపీ అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న నిర్మల ఆది నుంచి బీజేపీలోనే కొనసాగుతున్నారు. నిర్మల నిబద్ధతకు గుర్తుగా మోదీ ప్రధాని కాగానే… ఆయన కేబినెట్ లో మంత్రిగా పదవిని దక్కింది. ఆ తర్వాత ఏకంగా ఆర్థిక మంత్రి పదవి ఆమెను వరించింది. ఓ మహిళా ఆర్థిక మంత్రిగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నవారిలో నిర్మలదే రికార్డు అని చెప్పక తప్పదు.
ఇక పురందేశ్వరి విషయానికి వస్తే… టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు కుమార్తెగా మంచి గుర్తింపు ఉంది. విద్యావంతురాలు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో చేరిన పురందేశ్వరి ఏకంగా కేంద్ర మంత్రి పదవిని దక్కించుకుని సత్తా చాటారు. దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేబినెట్ లో సత్తా చాటిన అతి కొద్ది మంది మంత్రుల్లో పురందేశ్వరి ముందు వరుసలో ఉంటారని చెప్పాలి. పార్టీ సంస్థాగత వ్యవహారాలతో పాటుగా పాలనా పరంగా కూడా పురందేశ్వరి మంచి పట్టు సాధించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి కొనసాగిన సమయంలో పార్టీలో పిన్ డ్రాప్ సైలెన్న్ పరిస్థితి కొనసాగడమే ఆమె పనితీరుకు నిదర్శనమని చెప్పక తప్పదు.
ఇక చివరి స్థానంలో ఉన్న వాసతీ శ్రీనివాసన్ 1993 నుంచి కమల దళంలోనే కొనసాగుతున్నారు. గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు (దక్షిణ) స్థానం నుంచి బరిలోకి దిగిన వాసతీ… మక్కల్ నీది మయ్యమ్ అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ ను చిత్తు చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ విజయం వాసతీని బీజేపీలో ఎక్కడికో తీసుకెళ్లిందని చెప్పాలి. 2021లో కమల్ ను ఓడించిన వాసతీ… ఆ మరుసటి ఏడాదే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాసతీకి బీజేపీ జాతీయ అధ్యక్షురాలి పదవి ఇచ్చే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates