ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గిరిజనుల సంక్షేమం.. వారి సౌకర్యాలు వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రహదారులు వేయిస్తున్నారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. అంతేకాదు.. వారి మనసెరిగి మెసులు కుంటున్నారు. కొన్నాళ్ల కిందట.. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని గిరిజనుల కుటుంబాలకు పాదరక్షలు పంపించిన విషయం గుర్తుండే ఉంటుంది.
అప్పట్లో అడవి బిడ్డలు పవన్ కల్యాణ్ ఆప్యాయతకు పొంగిపోయారు. మూడు మాసాల కిందట.. పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలో సుదూరంగా ఉండే కురిడి గ్రామాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఆయన అక్కడ కాలికి చెప్పులు లేకుండా రాళ్లు రప్పలపై తిరుగుతున్న గిరిజనులను చూసి ద్రవించిపోయారు. ఈ క్రమంలోనే తాను తిరిగి మంగళగిరికి వచ్చాక.. ప్రత్యేక వాహనంలో 500 మందికి పైగా చెప్పుల జతలు పంపించారు. దీంతో గిరిజనుల కళ్లలో ఆనందరం.. సుడులు తిరిగింది.
తాజాగా మరోసారి ఆ ప్రాంత గిరిజనుల పట్ల పవన్ కల్యాణ్ స్పందించారు. వారికి తన తోటలో పండించిన మామిడి పండ్లను పంపించారు. అయితే.. ఈ విషయాన్ని ముందుగానే ఎవరికీ చెప్పకుండా.. చాలా గోప్యంగా ఉంచారు. మొత్తం 300లకు పైగా కుటుంబాలు కురిడి గ్రామంలో ఉన్నాయి. అక్కడి ప్రతి ఇంటికీ.. అరడజను చొప్పున నాణ్యమైన తీపి మామిడి పండ్లను పంపించారు.
ప్రత్యేక వాహనంలో మంగళగిరి నుంచి చేరిన మామిడి.. ఇంటింటికీ అందాయి. దీంతో గిరిజన బిడ్డలు ఎంతో ఆప్యాయంగా వాటిని ఆరగించారు. కాగా.. ఈ మామిడి పండ్లను ఆర్గానిక్(సంప్రదాయ ఎరువుల విధానం) విధానంలో పండించడం గమనార్హం. ప్రతికుటుంబానికీ ఆరేసి చొప్పున వీటిని అందించారు. దీంతో గిరిజనులు మా మంచి పవన్ అంటూ.. మురిసిపోయారు.
This post was last modified on July 4, 2025 12:42 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…