Political News

కూటమి ఎఫెక్ట్: ఏపీలో పర్యటిస్తున్న బీహార్ నేతలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎలా విజయం దక్కించుకుంది? ఎంత ఒబ్బిడిగా ముందుకు సాగింది? ఎలాంటి పంథా అనుసరించింది? అనేవి ఆసక్తికర విషయాలు. ఎందుకంటే భిన్నమైన సిద్ధాంతాలు, భిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్న నాయకులు కలిసి కూటమిగా ఏర్పడి విజయం దక్కించుకున్నారు. ఇది ఒక ప్రయోగమని చెప్పాలి. అంతేకాదు భవిష్యత్తులో కూటమిగా ఏర్పడే పార్టీలకు ఇది ఒక కేసు స్టడీగా ఉపయోగపడుతుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ బీహార్ కు చెందిన కొంతమంది నాయకులు ఏపీలో పర్యటిస్తున్నారు. వారు ఇక్కడ కూటమి ఏ విధంగా విజయం దక్కించుకుంది ఎలాంటి ఫార్ములా అనుసరించింది ఏ విధంగా ముందుకు సాగింది అనే అంశాలపై అధ్యయనం చేస్తున్నారు.

ప్రస్తుతం అత్యంత గుట్టుగా సాగుతున్న ఈ అధ్యయనం అనంతపురం, కడప జిల్లాల్లో జరుగుతోందని తెలుస్తోంది. త్వరలోనే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బిజెపి.. అదే విధంగా జనతాద‌ళ్‌ యునైటెడ్(జేడీయూ) పార్టీలు కూటమిగా ఉన్నాయి. వీటితోపాటు చిన్నాచితగా పార్టీలు కూడా కూట‌మిలో కలిశారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేది పెద్ద ఎత్తున చేస్తున్న ప్రయత్నం. ఈ పార్టీ కూడా ఆర్జెడి సహా మరో రెండు మూడు చిన్న పార్టీలతో కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతోంది.

ఈ క్రమంలో అటు నితీష్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్డీఏ కూటమి, ఇటు కాంగ్రెస్ నేతృత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ వంటి కీలక నేతలు ఉన్న ఆర్జెడి కూటమి మ‌రో ర‌కంగా యూపీఏ కూటమి ఈ రెండు ఏ విధంగా విజయం దక్కించుకోవాలనే అంశంపై తర్జనభర్జన పడుతున్నాయి. రెండు కూటములే. ఏపీలో మాదిరిగా బీహార్లో ఏకపక్షంగా ఎవరూ పోటీ చేయట్లేదు. ఏపీలో అయితే జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడం తెలిసిందే. ఒకవైపు కూటమి మూడు పార్టీలు కలిసి వెళ్తే….బీహార్లో రెండే కోటములు ఒకటి కాంగ్రెస్ నేతృత్వంలో రెండోది బిజెపి నేతృత్వంలో ఉంది.

రెండు కూటముల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం దక్కించుకోవడానికి ఏ విధమైన ఫార్ములాని అనుసరించాలి? అనే విషయం ఆసక్తిగా ఉంది. ఇప్పుడు అదే ఫార్ములాని అధ్యయనం చేయడం కోసం ఆ రాష్ట్రానికి చెందిన ఒకరిద్దరు నాయకులు ఏపీలో పర్యటిస్తున్నారు. ఇది జాతీయ మీడియా చెప్పిన మాట. ఏపీలో ఎలా విజయం దక్కించుకున్నారు? కూటమి ఇచ్చిన హామీలు ఏంటి? ప్రజలు కూటమి వైపు ఎందుకు మగ్గుచూపారు? ఇట్లాంటివన్నీ అధ్యయనం చేసి వాటిని ఒక కేసు స్టడీ లాగా మలుచుకుని బీహార్లో అప్లై చేయాలి అనేది ఈ నాయకుల ఉద్దేశం.

అయితే వీరు ఏ పార్టీకి చెందినవారు? అనేది అత్యంత గోప్యంగా ఉంచారు. అటు బిజెపికి చెందినవారు, ఇటు కాంగ్రెస్కు చెందినవారా అనేది రహస్యంగా ఉంచారు. వాస్తవానికి బిజెపి అయినా కాంగ్రెస్ అయినా సీనియర్ మోస్ట్ పార్టీలు. పైగా అధికారంలోకి వచ్చిన పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు. కానీ ఇప్పుడు ఈ అధ్య‌య‌నం చేయడానికి కారణం ఏంటి? కూటమి పార్టీలు కొత్త కానీ, ఈ రెండు జాతీయ జాతీయ పార్టీలు ఎందుకు అధ్యయనం చేయాలని అనుకుంటున్నాయి? అధ్యయనం చేస్తున్నాయి? అంటే ఎప్పటికప్పుడు మారుతున్న ప్రజల నాడిని పట్టుకోవడంలో.. ప్రజల నాడిని తెలుసుకోవడంలో నాయకులు వెనకబడుతున్నారు.

పార్టీలు వెనకబడుతున్నాయి. కూటమిగా కూడా ఓడిపోయిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఎటువంటి అంశాలను ముందుకు తీసుకెళ్లారు.. ఏపీలో కూటమి విజయానికి కారణాలు ఏంటి.. ప్రజల స్పందన ఎట్లా ఉందనేది మరోసారి కేసు స్టడీ మాదిరిగా తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని బట్టి బీహార్ లో ఏ పంథా అనుసరించాలి అనేది నిర్ణయించుకునే అవకాశం ఉంది.

This post was last modified on June 30, 2025 9:11 am

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

2 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

3 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

3 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

4 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

5 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

8 hours ago