ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం మెరుపులు మెరిపిస్తోంది. గతానికి ఇప్పటికి భిన్నంగా అనేక మార్పులు కనిపిస్తున్నాయి. రహదారుల నుంచి మౌలిక వసతుల వరకు.. అనేక విధాలుగా మార్పులకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. తద్వారా గ్రామీణ ఏపీ ముఖ చిత్రాన్ని మార్పు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు తోడు.. రాష్ట్ర సర్కారు నిధులు కూడా జోడించి… గ్రామాల్లో ప్రజలకు మరిన్ని సౌకర్యాలుకల్పించనుంది. కల్పిస్తోంది.
1) జల్ జీవన్ మిషన్: ఈ పథకాన్ని ఎప్పుడో ప్రారంభించినప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం పెద్దగా పట్టించు కోలేదు. కానీ, కూటమి సర్కారు ఇంటింటికీ తాగునీరు అందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్‌ను అమలు చేస్తోంది. తద్వారా.. మెరుగైన నీటిని ఇంటకే సరఫరా చేస్తోంది. ప్రస్తుతం మారు మూల గ్రామాల్లోనూ ఈ పనులు వడివడిగా సాగుతున్నాయి.
2) గ్రామీణ్ సడక్ యోజన: గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు.. రహదారులు లేని గ్రామాలు.. రాష్ట్రంలో 1200లకు పైగానే ఉన్నాయి. ఇప్పుడు వాటికి కూడా సర్వాంగ సుందరంగా.. రహదారులు నిర్మిస్తున్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతోపాటు.. పంచాయతీల నిధులను జోడించి.. వీటిని నిర్మిస్తున్నారు. ఈ పనులు కూడా జిల్లాల్లో చాలా వరకు పూర్తయ్యాయి. మిగిలిన వాటిని.. ఈ ఏడాది వర్షాకాలానికి ముందే పూర్తి చేయనున్నారు.
3) ఉపాధి హామీ: ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వలసలు పోకుండా ఉన్నచోటే ఉపాధి చూపించనున్నారు. తద్వారా వారికి ఆర్థిక స్థిరత్వం కల్పించనున్నారు.
4) ఐటీ, ఇంటర్నెట్: గ్రామీణ ప్రాంతాల్లో ఐటీకి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. త్వరలోనే డిజిటల్ అక్షరాస్యతను పెంచేలా గ్రామాల్లో క్లస్టర్లను ఏర్పాటు చేసి.. గ్రామీణులకు ఐటీపై అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్‌ను మరింత ఎక్కువ మందికి అందించనున్నారు.
5) సాగు-బాగు: గ్రామీణ ప్రాంతాలంటేనే సాగుకు ప్రతిరూపం. దీంతో రైతులను అత్యాధుని వ్యవసాయ పద్ధతులు అలవరుచుకునే దిశగా సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. డ్రోన్ల సాయంతో రైతులు మేలైన సాగు చేసేదిశగా ప్రోత్సహించనుంది. అంతేకాదు.. ఏయే పంటలు ఎప్పుడు వేయాలన్నది కూడా ముందుగానే చెప్పి.. వారిని చైతన్య పరచనుంది.
6) పంచాయతీలకే హక్కులు: వైసీపీ హయాంలో కనుమరుగైన పంచాయతీ హక్కులకు కూటమి ప్రభుత్వం ప్రాణం పోసింది. సర్పంచులకు చెక్ పవర్ ఇచ్చింది. అదేవిధంగా కేంద్రం ఇచ్చే నిధులను నేరుగా వారి ఖాతాల్లోనే జమచేయనుంది. ఇలా.. ఏడాది పాలనలో సర్కారు గ్రామీణ ఏపీ రూపు రేఖలు మార్చే ప్రయత్నం చేస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates