‘భేష్‌.. లోకేష్‌.. నీ ప్ర‌యాణం బాగుంది!’

మంత్రి నారా లోకేష్‌కు కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్‌ షెకావ‌త్ నుంచి ఊహించ‌ని ప్ర‌శంస ల‌భించింది. భేష్ లోకేష్‌.. నీ ప్ర‌యాణం బాగుంది.. దీనిని ఇలానే కొన‌సాగించు. మ‌రింత మెరుగు ప‌రుచు. అని సూచించా రు. తాజాగా ఏపీలో ప‌ర్య‌టించిన గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌.. గురువారం సాయంత్రం రాజ‌మండ్రి నుంచి నేరుగా ఉండ‌వ‌ల్లికి వ‌చ్చారు. సీఎంను క‌లుసుకునేందుకు ముందు.. ఆయ‌నను నారా లోకేష్ క‌లుసుకున్నారు.

ఉండ‌వ‌ల్లికి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ ద్వారా వ‌చ్చిన షెకావ‌త్‌కు.. మంత్రి నారా లోకేష్ ఆహ్వానం ప‌లికారు. తొ లుత ఆయ‌న.. కేంద్ర మంత్రిని త‌న క్యాంపు కార్యాల‌యంలోకి తీసుకువెళ్లారు. ఈసంద‌ర్భంగా త‌న యువ గ‌ళం పాద‌యాత్ర‌కు సంబంధించిన బుక్ లెట్‌ను కేంద్ర మంత్రికి బ‌హూక‌రించారు. ఆనాటి విశేషాల‌ను వివ‌రించారు. పుస్త‌కంలోని ఆస‌క్తిగా తిల‌కించిన కేంద్ర మంత్రి లోకేష్‌.. పాద‌యాత్ర వివ‌రాల‌ను అడిగి మ‌రీ తెలుసుకున్నారు.

అనంత‌రం గ‌జేంద్ర సింగ్ మాట్లాడుతూ.. నీ ప్ర‌యాణం బాగుంది.. దీనిని కొన‌సాగించు అని లోకేష్‌కు సూచించారు. అనంత‌రం అక్క‌డి నుంచి సీఎం చంద్ర‌బాబును క‌లుసుకునేందుకు ఆయ‌న వెళ్లారు. కాగా.. రాష్ట్రానికి వ‌స్తున్న ప్ర‌ముఖుల‌కు మంత్రి నారా లోకేష్ యువ‌గ‌ళం పుస్త‌కాన్ని బ‌హూక‌రిస్తున్నారు. యువ‌గ‌ళం స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌తో ఆయ‌న మ‌మేక‌మైన తీరు.. అప్ప‌ట్లో ప్ర‌జ‌ల స్పంద‌న‌ను క‌ళ్ల‌కు క‌డుతూ.. రూపొందించిన ఈ పుస్త‌కాన్ని ప్ర‌త్యేకంగా ముద్రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ధాని స‌హాప‌లువురు కేంద్ర మంత్రుల‌కు, రాష్ట్ర మంత్రుల‌కు బ‌హూక‌రించారు.