అదో ఏపీలోని మారుమూల జిల్లా, వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన శ్రీకాకుళం జిల్లా. ఆ జిల్లాలోని టెక్కలిలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలతో పాటుగా అదే పాఠశాలలో బాలికల జూనియర్ కళాశాల కూడా కొనసాగుతోంది. ఏటా అటు పాఠశాలతో పాటుగా ఇటు కళాశాలలోనూ సీట్లు నిండక అధ్యాపకులు ఈగలు తోలుకున్న పరిస్థితి. అయితే కూటమి సర్కారు వచ్చిన తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన విద్యా సంస్కరణల కారణంగా ఇప్పుడు ఆ జూనియర్ కళాశాలలో ‘నో మోర్ సీట్స్’ బోర్డు పెట్టేశారు.
సాధారణంగా ఇటీవలి కాలంలో ప్రభుత్వ కళాశాలల వైపు చూస్తున్న పిల్లల సంఖ్య చాలా తక్కువే. మరీ దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాల పిల్లలు తప్పనిసరి పరిస్థితుల్లో సర్కారీ విద్యాలయాల వైపు చూస్తున్నారు. ఏ విభాగంలో ఖాళీలు ఉంటే ఆ విభాగాల్లో చేరిపోతున్నారు. ఆపై కొందరు దూకుడుగా ముందుకు సాగుతూ ఉంటే.. మరికొందరు అక్కడే ముక్కుతూ మూలుగుతూ ఏళ్ల తరబడి ఆయా కోర్సులను పూర్తి చేసేందుకు కుస్తీలు పడుతున్నారు. ఇక ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు కూడా సర్కారీ విద్యను పట్టించుకున్నపాపాన పోవడం లేదు. ఫలితంగానే సర్కారీ విద్యాలయాల్లో ‘నో మోర్ సీట్స్’ బోర్డు అన్న మాటే కనిపించదు. వినిపించదు.
అయితే ఏడాది పాలనలో లోకేశ్ విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న సంస్కరణల కారణంగా ప్రభుత్వ విద్యాలయాలపై జనానికి నమ్మం కుదిరింది. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ కళాశాలల్లో కాకుండా ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో పలు ప్రభుత్వ విద్యాలయాల్లో ‘నో మోర్ సీట్స్’ బోర్డులు కనిపించడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందులో తొలిగా టెక్కలి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఈ బోర్డును పెట్టి తన ప్రత్యేకతను చాటుకుంది.
This post was last modified on June 21, 2025 7:29 am
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…