Political News

మంగ్లీ ఎఫెక్ట్‌: పెద్దోళ్ల‌కు పోలీసుల సీరియ‌స్ వార్నింగ్‌

ప్ర‌ముఖ గాయ‌కురాలు మంగ్లీ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం రాత్రి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప‌రిధిలోని ఓ రిసార్ట్‌లో త‌న స్నేహితుల‌ను పిలిచి పార్టీ ఇచ్చారు. అయితే.. ఇది టీ పార్టీనో.. మందు పార్టీనో అయితే.. ఏమ‌య్యేదో ఏమో.. కానీ, ఆ పార్టీలో గంజాయి గుప్పుమంది. దీంతో ఈ వ్య‌వ‌హారం రచ్చ‌కెక్కింది. అంతేకాదు.. డ్ర‌గ్స్ తీసుకున్నార‌న్న చ‌ర్చ కూడా మొదలైంది. ఇప్ప‌టి వ‌ర‌కు మంగ్లీ అంటే.. తెలంగాణ స‌మాజంలో `గుడ్ సింగ‌ర్‌`, `జెన్యూన్ ప‌ర్స‌నాలిటీ` అనే పేరుంది. ఈ ఘ‌ట‌న త‌ర్వాత‌.. ఆమెపై విమ‌ర్శ‌లు.. మూతి బిగింపులు, పెద‌వి విరుపులు సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేశాయి.

ఇక‌, పోలీసుల ఎంట్రీతో ఈ వ్య‌వ‌హారం మ‌రింత సీరియ‌స్ అయింది. కేసుల వ‌ర‌కు కూడా చేరింది. ఇదిలావుంటే.. మంగ్లీ ఎఫెక్ట్ ఆమెతోనో.. ఆమె స్నేహితుల‌తోనో లేక ఈ పార్టీకి వేదిక అయిన రిసార్ట్‌తోనో పోలేదు. ఏకంగా `పెద్ద‌ల‌`కు కూడా చుట్టుకుంది. తాజాగా తెలంగాణ పోలీసులు పెద్ద‌ల‌ను ఉద్దేశించి సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. తేడా వ‌స్తే.. లాఠీలు విరుగుతాయ‌న్న‌ట్టుగా భారీ మెసేజే పెట్టారు. ఎంత‌టివారినైనా ఉపేక్షించేది లేద‌ని తేల్చి చెప్పారు. ఎంతటి ప్రముఖులైనా డ్రగ్స్‌ లాంటి మత్తు పదార్థాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీసు ఉన్న‌తాధికారులు తమ అధికారిక‌ ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు పెట్టారు.

నిజానికి హైద‌రాబాద్‌లో గ‌త కేసీఆర్ హ‌యాంలోనే పెద్ద ఎత్తున డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం వెలుగు చూసింది. అప్ప‌ట్లో ఐపీఎస్ అధికారి నేతృత్వంలో పెద్ద ఎత్తున సినీ ప్ర‌ముఖుల‌ను కూడా పిలిచి విచారించారు. అనేక మంది టెస్టులు కూడా చేశారు. ఆ త‌ర్వాత‌.. ఏమైందో ఏమో.. ఆ కేసులు మ‌రుగున ప‌డ్డాయి. త‌ర్వాత కాంగ్రెస్ హ‌యాంలోనే అడ‌పా ద‌డ‌పా కేసులు న‌మోదవుతూనే ఉన్నాయి. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం డ్ర‌గ్స్ వినియోగించేవారికి అదే చివ‌రి రోజు అవుతుంద‌ని.. దీనిపై ఉక్కుపాదం మోపుతున్నామ‌ని గ‌తంలో ప్ర‌క‌టించారు. దీని ప్ర‌కారం పోలీసులు కూడా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

డ్ర‌గ్స్ వినియోగ‌మే కాదు.. వీటిని క‌లిగి ఉన్న వారిపైనా కేసులు పెట్టి.. డ్ర‌గ్స్ చ‌ట్టాల కింద కేసులు న‌మోదు చేస్తున్నారు. ప్ర‌తి విష‌యాన్నీ సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో చాలా రోజుల త‌ర్వాత‌.. మంగ్లీ ఏర్పాటు చేసిన విందు పార్టీలో మ‌రోసారి గంజాయి క‌ల‌క‌లం రేగ‌డం.. డ్ర‌గ్స్ కూడా వినియోగించారన్న వార్త‌లు రావ‌డంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ విష‌యంలో `పెద్ద‌ల‌నే`వారు టార్గెట్ చేస్తూ.. సీరియ‌స్ వార్నింగ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ వ్య‌వ‌హారంతో అయినా.. మార్పు క‌నిపిస్తుందేమో చూడాలి.

This post was last modified on June 11, 2025 8:49 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Telangana

Recent Posts

రామ్ టీమ్… గ్రౌండ్ రియాలిటీ తాలూకా

మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…

6 hours ago

అమిత్ షాతో మంత్రి లోకేష్ భేటీ, కారణం ఏంటి?

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…

6 hours ago

జగన్ ‘అరటి’ విమర్శల్లో నిజమెంత?

ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…

7 hours ago

‘కోనసీమ పచ్చదనం’.. జనసేన పార్టీ ఫస్ట్ రియాక్షన్

ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…

7 hours ago

పీఎంవో పేరు-భ‌వ‌నం కూడా మార్పు.. అవేంటంటే!

దేశంలో పురాత‌న, బ్రిటీష్ కాలం నాటి పేర్ల‌ను, ఊర్ల‌ను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్ర‌భుత్వం…

8 hours ago

‘రాజధాని రైతులను ఒప్పించాలి కానీ నొప్పించకూడదు’

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయి మ‌హాన‌గ‌రంగా నిర్మించాల‌ని నిర్ణ‌యించుకున్న సీఎం చంద్ర‌బాబు.. ఆదిశ‌గా వ‌డి వ‌డిగా అడుగులు వేస్తున్నారు.…

8 hours ago