వైసీపీ అధినేత జగన్‌కు మంత్రి, టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ పంచ్‌లతో ఝలక్ ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలకు, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతోందని.. శాంతి భద్రతలను గాలికి వదిలి కక్ష సాధింపు రాజకీయాలకు చంద్రబాబు పాల్పడుతున్నారంటూ.. జగన్ వ్యాఖ్యానించారు. ఇదేసమయంలో మహిళల విషయంలో చంద్రబాబు, ఆయన బావమరిది, నటుడు బాలయ్య, అదేవిధంగా కుమారుడు నారా లోకేష్ ఎలా వ్యవహరించారో చూడండి.. అంటూ.. తన ఎక్స్ ఖాతాలో జగన్ పలు పోస్టులు చేశారు.
ఈ క్రమంలో నారా లోకేష్, బాలయ్య గతంలో పాల్గొన్న కార్యక్రమాలు, అదేవిధంగా వారికి సంబంధించిన పాత ఫొటోలను కూడా జగన్ పోస్టు చేశారు. విదేశీ యువతులతో లోకేష్ ఎలా వ్యవహరించారో చూడండంటూ.. ఓ పుష్కర కాలం కిందటి ఫొటోలను ఆయన షేర్ చేశారు. అలాగే బాలయ్య ఓ సినీ ఫంక్షన్‌లో చేసిన వ్యాఖ్యలను కూడా కోట్ చేశారు. వీరా మమ్మల్ని అనేది అని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని మహిళలపై సాక్షి మీడియాలో వచ్చిన చర్చలో చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు.
అయితే.. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు, పోస్టు చేసిన ఫొటోలపై నారా లోకేష్ కూడా తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన.. పంచ్‌లతో విరుచుకుపడ్డారు. “జగన్ గారు మీ కపటత్వానికి నాకు నవ్వు వస్తోంది.. “నాకు కాలేజీ లైఫ్ ఉంది.. మీకు జైలు జీవితం ఉంది” – “నాకు క్లాస్మెట్స్ ఉన్నారు… మీకు జైలుమెట్లు ఉన్నారు” – అర్థమైందా రాజా? అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. గతంలో కూడా.. జగన్ ఇలానే పోస్టు చేస్తే.. దీనికి లోకేష్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అలానే.. చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates