ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 12కు ఏడాది పూర్తవుతుంది. వాస్తవానికి ఎన్నికల ఫలితం వచ్చింది జూన్ 4నే అయినా.. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది మాత్రం గత ఏడాది జూన్ 12న. దీంతో ఈ నెల 12నాటికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని పార్టీల పరంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు రెడీ అయ్యాయి. ఈ పార్టీల్లోనూ టీడీపీ నేతలు.. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలను కలుసుకునేం దుకు ప్లాన్ చేసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ఏడాది పాలనపై వారు వివరించనున్నారు.
ఇక, జనసేన కూడా ఈ నెల 12న పార్టీ రాష్ట్ర కార్యాలయం సహా.. క్షేత్రస్థాయిలోనూ విజయోత్సవాలు చేసుకోవాలని పిలుపుని చ్చింది. రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారు. బీజేపీ మాత్రం రాష్ట్ర స్థాయిలో కూటమి విజయం కంటే.. కూడా ప్రధాని మోడీ విజయంపైనే దృష్టి పెట్టింది. ఆ మేరకు అన్ని పార్టీ కార్యాలయాల్లోనూ మోడీ విజయంపై కార్యక్రమా లు చేపట్టనున్నారు. ఇలా.. మూడు పార్టీలూ వివిధ రూపాల్లో ఈ నెల 12న కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాయి. అయితే. తాజాగా ప్రభుత్వం తరఫున కూడా విజయోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సర్కారు రెడీ అయింది.
దీనిలో భాగంగా ‘సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరుతో రాష్ట్ర స్థాయి వేడుక నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12న(గురువారం) సాయంత్రం రాష్ట్ర స్థాయిలోఈ వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్‌లు పాల్గొనాలని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలోనే కాకుండా.. జిల్లాల స్థాయిలోనూ కలెక్టర్ల ఆఫీసుల వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు.
ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమం.. అదేవిధంగా విజన్ 2047, స్వర్ణాంధ్ర-2047 వంటి వాటిని వివరించాలని కలెక్టర్లకు, ఆర్డీవోలకు సూచించారు. అలాగే.. పింఛన్లను అందిస్తున్న తీరు, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందుతున్న సేవలను హైలెట్ చేయాలన్నారు. అదేవిధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కూడా.. ప్రభుత్వం సాధించిన ఏడాది ప్రగతిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం గమనార్హం.
This post was last modified on June 10, 2025 7:33 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…