Political News

పోలీసులూ మీ ఇష్టం : చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాష్ట్ర పోలీసుల‌కు పూర్తి స్వేచ్ఛ‌ను ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. “పోలీసులూ మీ ఇష్టం. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నా.. నేనేమీ అడ‌గ‌ను. కానీ, రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు, యువ‌తుల‌కు, చిన్నారుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాలి. అసాంఘిక శ‌క్తులు నేరం చేయాలంటేనే వ‌ణుకు పుట్టేలా చేయాలి” అని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాజాగా స‌చివాల‌యంలో రాష్ట్ర డీజీపీ స‌హా హోం శాఖ సెక్ర‌ట‌రీతో చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా గ‌త వారం రోజుల్లో రాష్ట్రంలో వెలుగు చూసిన ప‌లు కీల‌క అంశాల‌పై వారితో చ‌ర్చించారు. త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.

అనంత‌పురంలో ఇంట‌ర్ విద్యార్థిని దారుణ హ‌త్య‌, క‌ర్నూలులో బాలిక‌పై సామూహిక అత్యాచారం.. వంటివాటిని ప్ర‌స్తావించారు. పోలీసుల‌కు స్వేచ్ఛ‌నిస్తున్నామ‌ని.. అయినా.. నేరాలు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని చెప్పారు. ముఖ్యంగా గంజాయి ముఠా ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌డం లేద‌న్నారు. ఈ విష‌యంలో పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నా.. తాను త‌ప్పుబ‌ట్ట‌న‌ని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అత్యంత ముఖ్య‌మని సీఎం తేల్చి చెప్పారు. గ‌త వారంలో జ‌రిగిన రెండు మూడు ఘ‌ట‌న‌లు త‌న‌ను కూడా క‌ల‌చి వేశాయ‌న్నారు. ఇలాంటి ప‌రిస్థితి ఎందుకు వ‌స్తోంద‌ని ప్ర‌శ్నించారు. కేసు పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకున్న ఆయ‌న త‌గిన శిక్ష‌లు ప‌డేలా కోర్టులో వాద‌న‌లు వినిపించాల‌ని సూచించారు.

నిందితుల‌ను ఉపేక్షించ‌రాద‌ని సీఎం సూచించారు. ముఖ్యంగా మ‌హిళ‌లు, చిన్నారుల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాల‌ను క‌ట్ట‌డి చేయాల‌ని చెప్పారు. వ్య‌వ‌స్థీకృత నేరాల‌కు పాల్ప‌డే వారిని నిరంత‌రం ప‌ర్యవేక్షించాల‌ని.. అవ‌స‌ర‌మైతే.. ముందుగానే వారిని అదుపులోకి తీసుకుని వార్నింగ్ ఇవ్వాల‌ని సూచించారు. నేరాలకు పాల్పడే వారికి శిక్ష తప్పదనే అభిప్రాయాన్ని కలిగించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వైసీపీ హ‌యాంలో శాంతి భ‌ద్ర‌త‌లు గాడి త‌ప్పాయ‌ని.. అందుకే ప్ర‌జ‌లు కూట‌మి ప్ర‌భుత్వంపై చాలా ఆశలు పెట్టుకున్నార‌ని వివ‌రించారు. ఈ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. గ‌తంలో గంజాయికి బానిస‌లుగా మారిన యువ‌త‌ను కూడా క‌నిపెట్టాల‌న్నారు.

ఇక‌, తాజాగా వెలుగు చూసిన సెక్స్ వ‌ర్క‌ర్స్ రిపోర్టుపైనా చంద్ర‌బాబు చ‌ర్చించారు. ఇది వాస్త‌వ‌మైతే.. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుని.. మ‌హిళ‌ల‌ను, యువ‌తుల‌ను ఆ వృత్తిలోకి దింపే వారిని క‌ట్ట‌డి చేసి పీడీ యాక్టులు బ‌నాయించాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇలాంటివారిని ఉపేక్షించరాద‌న్నారు. ఈ విష‌యంలో రాజ‌కీయాల‌కు అతీతంగా పోలీసులు ప‌నిచేయాల‌ని, ప్ర‌భుత్వానికి మ‌చ్చ‌తెచ్చేవారు ఎంత‌టివారైనా ఉపేక్షించ‌రాద‌ని తేల్చి చెప్పారు.

This post was last modified on June 10, 2025 7:29 pm

Share

Recent Posts

డబ్బుల్లేక.. కూతురిని హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి!

కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…

35 minutes ago

హౌతీల దాడితో మధ్యలోనే వెనుదిరిగిన ఎయిరిండియా ఫ్లైట్

యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…

38 minutes ago

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

2 hours ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

2 hours ago

జైలర్ 2 ఋజువు చేయాల్సినవి ఎన్నో

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…

2 hours ago

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

4 hours ago