రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ వ్యవహార శైలి చాలా విచిత్రంగా ఉంటోంది. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ వ్యతిరేకించటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లుంది. ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలోనే ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి తగ్గట్లుగా కసరత్తు చేయమని చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఓ ఉన్నతస్ధాయి కమిటిని ప్రభుత్వం నియమించింది. కమిటి దాదాపు మూడు నెలలు జిల్లాల కలెక్టర్లు, రెవిన్యు అధికారులతో కసరత్తు చేసి ఓ నివేదికను అందించింది.
13 జిల్లాల రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా మార్చాలని జగన్ నిర్ణయించారు. విశాఖపట్నం జిల్లాలోని అరకు పార్లమెంటు నియోజకవర్గం చాలా పెద్దదిగా కాబట్టి దీన్ని రెండు జిల్లాలుగా చేయాలనే ప్రతిపాదనలున్నాయి. దాంతో జిల్లాల సంఖ్య 26గా మారబోతోంది. ఇటువంటి సమయంలో శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాల సంఖ్య పెంచటంలో రాజకీయమే కనిపిస్తోందట ఈ ఎంపికి. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జిల్లాల సంఖ్యను పెంచితే తాను కూడా మద్దతిచ్చే వాడినంటు చెప్పటమే విచిత్రంగా ఉంది. 2026లో నియోజకవర్గాల పునర్వవ్యస్ధీకరణ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈలోగా జిల్లాల సంఖ్యను పెంచకూడదని డిమాండ్ చేస్తున్నారు.
ఇక్కడ రామ్మోహన్ వాదనలోని డొల్లతనం బాగా కనబడుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తనకు జరిగే లబ్ది ప్రకారమే ఏ నిర్ణయం అయినా తీసుకుంటుందన్నది అందరికీ తెలిసిందే. ఏ అధికారపార్టీ కూడా ప్రతిపక్షాలకు ఉపయోగంగా ఉండేట్లు నిర్ణయం తీసుకుంటుందా ఎక్కడైనా ? ఇంతచిన్న విషయం కూడా రామ్మోహన్ కు తెలీదా? టీడీపీ అధికారంలో ఉన్నపుడు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ప్రతిపక్షాలతో చెప్పే చేసిందా ? వైసీపీ ఆలోచనల ప్రకారం చేసిన ఒక్క నిర్ణయాన్ని చూపించగలరా ? నిర్ణయాలు తీసుకోవటం అన్నది అధికారపార్టీకి ఉన్న అడ్వాంటేజ్.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడితే ఏమి చేయాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు. అధికారంలో ఉన్న పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఏమైందో 2019 ఎన్నికల్లో నిరూపణ అయ్యింది. చిన్న జిల్లాల ఏర్పాటు అన్నది పరిపాలనా సౌలభ్యం కోసమే అని ప్రభుత్వం చెబుతోంది. కాదు రాజకీయం కోసమే టీడీపీ వ్యతిరేకిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణాలో కూడా 9 జిల్లాలను కేసీయార్ 31 జిల్లాలను చేసినపుడు టీడీపీ ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదు ?
చిన్న జిల్లాల ఏర్పాటులో మరో శాస్త్రీయకోణం కూడా ఉంది. అదేమిటంటే ఉత్తరాధి రాష్ట్రాల్లో చిన్న జిల్లాలే ఉండటం వల్ల కేంద్రం ఎక్కువ నిధులిస్తోంది. అంటే కేంద్రం మంజూరు చేసే నిధుల్లో ఎక్కువగా జిల్లాలను యూనిట్ గానే తీసుకుంటోంది. కాబట్టే కేంద్ర నిధుల్లో ఎక్కువగా ఉత్తరాధి రాష్ట్రాల్లోని జిల్లాలకే అందుతోంది. రేపు ఏపిలో కూడా ఎక్కువ జిల్లాలుంటే నిధులు ఎక్కువగా అందుకనే అవకాశాలున్నాయి.
ఒకవేళ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని తేలితే, సమస్యలు పెరిగిపోతే ఏమి చేయాలో జనాలకు బాగా తెలుసు. కాబట్టి జిల్లాల ఏర్పాటయ్యేంత వరకు టీడీపీ ఓపికపట్టాలి. దాని తర్వాత ఫీడ్ బ్యాక్ తీసుకుని వ్యూహాలు రచిస్తే బాగుంటుంది కాని ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ గుడ్డిగా వ్యతిరేకించటం మంచిది కాదు.
This post was last modified on November 9, 2020 6:02 pm
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…
దర్శకుడిగా చేసిన సినిమాలు తక్కువే కావచ్చు కానీ.. దేవా కట్టాకు ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీలో మంచి గుర్తింపే ఉంది. ‘వెన్నెల’…
విజయనగరం మాజీ ఎంపీ పూసపాటి అశోక్ గజపతి రాజు వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారా? ఇదే సమయంలో సీనియర్ నాయకుడైనప్పటికీ..…