తెలుగుదేశం పార్టీని ఎన్టీయార్ పెట్టినప్పటి నుండి యాక్టివ్ గా పనిచేస్తున్న తాళ్ళపాక రమేష్ రెడ్డి దంపతులు రాజీనామా చేయటం పార్టీలో సంచలనంగా మారింది. సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమను కాదని కొత్తగా వచ్చిన వారిని కూడా చంద్రబాబునాయుడు అందలం ఎక్కిస్తున్నాడన్న కోపంతోనే తాము రాజీనామా చేసినట్లు తాళ్ళపాక రమేష్ రెడ్డి చెప్పటం గమనార్హం. గతంలో ఎన్టీయార్ ను బూతులు తిట్టిన వారిని, ఎన్టీయార్ దిష్టిబొమ్మలను దహనం చేసిన వారికి కూడా చంద్రబాబు పార్టీలో పదవులిచ్చి తమను ఉద్దేశ్యపూర్వకంగానే పక్కకు నెట్టేసినట్లు తాళ్ళపాక దంపతులు మండిపోతున్నారు.
నెల్లూరు సిటీకి చెందిన తాళ్ళపాక ఎన్టీయార్ కు వీరాభిమాని. సినిమాల్లో ఉన్నపుడు అఖిల భారత ఎన్టీయార్ అభిమానుల సంఘానికి జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. ఆ అభిమానంతోనే ఎన్టీయార్ తో పాటు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నెల్లూరు ఎంఎల్ఏగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 1994లో ఎన్టీయార్ కు వెన్నుపోటు ఘటన తర్వాత కొంతకాలం రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. ఎన్టీయార్ మరణంతో మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. అయితే రమేష్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో ఎంత చురుగ్గా ఉన్నా చంద్రబాబు దగ్గర మాత్రం ఆదరణ లభించలేదు.
అందుకనే పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జిల్లా పార్టీ కార్యక్రమాలకే పరిమితమైపోయారు. పదవులు రాకపోయినా సరే పార్టీని మాత్రం వదిలిపోలేదు. జిల్లాలో ఇపుడు చాలా సీనియర్లని ప్రచారంలో ఉన్న చాలామంది నేతలకన్నా ముందే రమేష్ రెడ్డి పార్టీ కోసం పనిచేస్తున్నారు. మరి చంద్రబాబు, రమేష్ మధ్య ఏమైందో ఏమో మొన్నటి రాష్ట్రకమిటి ప్రకటన తర్వాత తాళ్ళపాక దంపతుల్లో ఒక్కసారిగా అసంతృప్తి పెరిగిపోయింది. తమ మద్దతుదారులతో సమావేశమైన వీరు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు హఠాత్తుగా ప్రకటించారు.
వీరి బాటలోనే పార్టీలో అసంతృప్తితో ఉన్న ఆనం జయకుమార్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ ఛైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు కూడా తాళ్ళపాక దంపతుల దారిలోనే వెళ్ళే అవకాశాలున్నట్లు ప్రచారంలో ఉంది. మొత్తానికి పార్టీ కమిటిల ప్రకటన టీడీపీలో బాగా రచ్చ జరుగుతున్నట్లే ఉంది. మరి ఈ సమస్యను చంద్రబాబునాయుడు ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి.
This post was last modified on November 9, 2020 2:20 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…