సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో నిర్మించుకున్న సువిశాల భవనం.. గృహ ప్రవేశం ఆదివారం తెల్లవారుజామును జరిగింది. శనివారం రాత్రి ఢిల్లీ నుంచినేరుగా హైదరాబాద్‌కు.. అక్కడ నుంచి బెంగళూరుకు వచ్చిన ఆయన రోడ్డు మార్గంలో కుప్పానికి చేరుకున్నారు. అనంతరం.. ఆయన నిద్రకూడా పోకుండానే.. గృహ ప్రవేశ ఘట్టంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సుమారు 25 వేల మంది పార్టీ నాయకులు, మంత్రులు, వీఐపీలను ఆహ్వానించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల నుంచి హైకోర్టు న్యాయమూర్తుల వరకు అందరినీ ఆహ్వానించారు. ఇక, ఈ గృహ ప్రవేశ ఘట్టంలో షడ్ర శోపేత మైన విందును ఇస్తున్నారు. ప్రధానంగా రెండు రకాలుగా విందు ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలు, మంత్రులకు వేరుగా.. నియోజకవర్గం ప్రజలకు వేరుగా వంటకాలు సిద్ధం చేయిస్తున్నారు. వీటిలో తేడా లేకపోయినా.. వీవీఐపీలకు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది.
ఇక, వంటకాల విషయానికి వస్తే..
చక్కెర పొంగలి, జిలేబీ, తాపేశ్వరం కాజా, ఆలూ సమోసా, జొన్న పిండి సమోసా, టమోటా రైస్, వెజ్ బిరియాని, రైతా, మామిడి కాయలతో తయారు చేసిన అన్నం, మఫ్రూమ్(పుట్టగొడుగులు) గుజ్జు కూర, బెండకాయ ఫ్రై, గుత్తివంకాయ మసాలా, వడపులు, ఆలూ ఫ్రై, టమాటా బీరకాయపచ్చడి, వైట్ రైస్, ఘీరైస్, లెమన్ రైస్, ఎల్లో రైస్, పరమాన్నం, రసం, సాంబార్, గోంగూర పచ్చడి, అప్పడం, పెరుగుతో పాటుగా ఆవకాయ కూడా ఏర్పాటు చేశారు. ఇక, ప్రత్యేక వంటకంగా.. క్యారెట్ హల్వా వడ్డించారు. చివరిలో ఐస్‌క్రీమ్, పాన్ అందించారు.