Political News

“జూన్ 4” జ‌నంలోకి జ‌గ‌న్ స్కెచ్ ఏంటి ..!

వ‌చ్చ‌నెల 4న తాను జ‌నంలోకి వ‌చ్చి తీరుతాన‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఆ రోజు ‘వెన్ను పోటు’ పేరుతో కూట‌మి స‌ర్కారు పై ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. ప్ర‌జ‌ల‌ను స‌మీక‌రించి రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు తెలిపి.. క‌లెక్టరేట్ల‌లో ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. దీనిపై తాజాగా జ‌గ‌న్ ఓ ప్ర‌క‌ట‌న చేశారు. అయితే.. ఇలా ఇప్ప‌టికి అనేక సంద‌ర్భాల్లో జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌లు చేసినా.. ఆయ‌న బ‌య‌ట‌కు రాలేదు.

కానీ, ఈ ద‌ఫా మాత్రం ఖ‌చ్చితంగా తాను బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని.. ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటాన‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. త‌ద్వారా చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచుతాన‌ని అంటున్నారు. అయితే.. జ‌గ‌న్ వేసిన ఈ స్కెచ్ వెనుక కీల‌క కార‌ణాలు ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌భుత్వం ఎవ‌రూ కోర‌కుండానే వ‌చ్చే నెల 12 నుంచి ప‌థ‌కాల అమ‌లుకు శ్రీకారం చుట్టింది. వీటిలో ప్ర‌ధానంగా ‘త‌ల్లికి వంద‌నం’ కార్య‌క్ర‌మం ఉంది.

దీనిని వ‌చ్చే నెల స్కూళ్లు తెరిచే నాటికి ప్రారంభిస్తామ‌ని స్వ‌యంగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అదేవి ధంగా రైతుల‌కు ఇచ్చే ఇన్ పుట్ స‌బ్సిడీ విష‌యంపైనా చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే నెల‌లో కేంద్రం రైతుల‌కు ఇచ్చే పీఎం కిసాన్ యోజ‌న‌తో దీనిని ప్రారంభించ‌నున్న‌ట్టు చెప్పారు. రాష్ట్రంలో ఈ రెండు కార్య‌క్ర‌మాల‌ను కూడా వ‌చ్చే నెల 10వ తేదీ నుంచి ప్రారంభించేందుకు రంగం రెడీ చేసుకుంటు న్నారు. ఇప్ప‌టికే ల‌బ్ధిదారుల జాబితాల‌ను రెడీ చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం.

అయితే.. ఇలాంటి కీల‌క స‌మ‌యానికి నాలుగైదు రోజుల ముందు.. జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నారు. వెన్ను పోటు పేరుతో ఉద్య‌మిస్తున్నారు. వాస్త‌వానికి ప్ర‌భుత్వం ఇప్ప‌టికే డెడ్‌లైన్ విధించిన నేప‌థ్యంలో దానిని ప‌రిశీలించి.. అప్ప‌టికి కూడా.. ఆయా కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేయ‌క‌పోతే.. జ‌గ‌న్ అప్పుడు ఉద్య‌మించి ఉంటే బాగుండేది. కానీ.. ముందుగానే ఆయ‌న చేప‌ట్ట‌డం ద్వారా.. రేపు ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాలు ఎలానూ అమ‌లు చేస్తుంది.

కాబ‌ట్టి.. వాటిని త‌న ఖాతాలో వేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అంటే.. మేం ఉద్య‌మించాం కాబ‌ట్టి.. చంద్ర‌బాబు ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నార‌న్న ప్ర‌చారం చేసుకునే వ్యూహం వేశార‌ని అంటున్నారు. త‌ద్వారా.. ప్ర‌జ‌ల సానుభూతిని దూసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నేది చ‌ర్చ‌గా మారింది. మ‌రి దీనిని చంద్ర‌బాబు ఎలా తిప్పికొడ‌తారో చూడాలి.

This post was last modified on May 23, 2025 5:57 pm

Share

Recent Posts

బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు

బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…

34 minutes ago

వాహ్ విజయ్… తడబడతాడనుకుంటే నిలబడ్డాడు!

తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…

1 hour ago

అందరూ బాధితులే… ఇంతకీ విలన్లెవరు?

ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…

3 hours ago

ఒంటరిగా యుద్ధ విమానం నడిపిన మహారాణి…

థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…

3 hours ago

డబ్బుల్లేక.. కూతురిని హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి!

కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…

4 hours ago

హౌతీల దాడితో మధ్యలోనే వెనుదిరిగిన ఎయిరిండియా ఫ్లైట్

యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…

4 hours ago