వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ మొత్తం ఒకేసారి ఇరుక్కుంటోందా? ఫ్యామిలీ అంతా ఒకేసారి జైలుకు వెళ్లక తప్పదా? అనేది ఇప్పుడు చిత్తూరులోనేకాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయింది. ఇప్పటికే పెద్దిరెడ్డి కుమారుడు, ఎంపీ మిథున్‌రెడ్డిపై మద్యం కేసు వేలాడుతోంది. ఆయనను ఇప్పటికే ఒకసారి విచారించారు. దీంతో ఈ కేసులో ఎప్పుడు ఏం జరుగు తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం.. మిథున్ రెడ్డి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇక, మదన పల్లె ఫైళ్ల దగ్ధం కేసులో ఇప్పటికే పెద్దిరెడ్డి ఫ్యామిలీలోని ఇద్దరిపై కేసులు ఉన్నాయి. వీటిని వడివడిగా తేల్చాలని ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కేసులు పుంజుకున్నాయి. అదేవిధంగా తాజాగా పెద్దిరెడ్డిపై అటవీ భూముల ఆక్రమణల కేసులు నమోదవుతున్నాయి. వీటిని నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యవేక్షిస్తున్నారు.
సో.. ఈ క్రమంలో అటు ఎంపీ మిథున్‌రెడ్డి, ఇటు ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపైనా ఒకేసారి కేసులు నమోదు కావడం .. వారిపై విచారణలు కూడా చేపట్టడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఏక్షణమైనా ఈ కేసులు పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు.. రాజకీయంగా కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇరకాటంలో పడింది. వైసీపీ సమావేశాలకు.. పార్టీ కార్యక్రమాలకు కూడా ఈ కుటుంబం దూరంగా ఉంటోంది. కేసుల్లో చిక్కుకోవడం.. వాటితోనే సతమతం అవుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఫలితంగా అటు రాజంపేటలోను.. ఇటు పుంగనూరులోనూ.. పెద్దిరెడ్డి ఫ్యామిలీ రాజకీయాలకు దాదాపు ఫుల్ స్టాప్ పడిందని అంటున్నారు. వాస్తవానికి కూటమి నాయకులు కూడా ఇదే కోరుకున్నారు. పెద్దిరెడ్డి రాజకీ యాలను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టాలనేది వీరి వ్యూహం. దీనికి ఇప్పుడు కేసులు కూడా కలిసి వచ్చి.. కుటుంబం కుటుంబమే సైలెంట్ అయిపోవడం నాయకులకు, కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండాపోవడం .. వంటివి పెద్దిరెడ్డి రాజకీయాలపై పెద్ద ప్రభావం పడేలా చేస్తోందని అంటున్నారు.
This post was last modified on May 17, 2025 4:21 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…